రాష్ట్ర ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలి’ అని సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top