క్రిస్మస్ ప్రార్థ‌న‌లో సీఎం వైయ‌స్ జగన్‌..

  కుటుంబ స‌మేతంగా హాజ‌రైన ముఖ్య‌మంత్రి

వైయ‌స్ఆర్ జిల్లా:  క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ముంద‌స్తుగా నిర్వ‌హించిన ప్రత్యేక ప్రార్థ‌న‌ల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుటుంబ స‌మేతంగా హాజ‌ర‌య్యారు. ఇడుపుల‌పాయ‌ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి శ‌నివారం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  అనంతరం అక్కడే క్రిస్మస్‌ కేక్‌ను కట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.


ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23 నుంచి 25వ వరకు మూడు రోజులపాటు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇవాళ ఉద‌యం ఇడుపులపాయలో వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి నివాళుల‌ర్పించారు.   
క్రిస్మ‌స్ వేడుక‌ల్లో వైయ‌స్ విజయమ్మ, సీఎం సతీమణి వైయ‌స్‌ భారతి, మంత్రులు అంజాద్‌బాషా, ఆదిమూల‌పు సురేష్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top