నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు

మాజీ మంత్రి వెల్లంప‌ల్లి కుమార్తె వివాహ వేడుక‌కు హాజ‌రైన సీఎం

గుంటూరు: విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు కుమార్తె వివాహ వేడుకలకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా  నూతన వధూవరులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వదించారు. మంగళగిరి సీకే కన్వెన్షన్స్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు సాయి అశ్విత, చక్రవర్తిలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వదించి, శుభాకాంక్ష‌లు తెలిపారు.

Back to Top