తాడేపల్లి: ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జననేత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను హంగూ ఆర్భాటాలకు దూరంగా, నిరాడంబరంగా జరుపుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈనెల 21వ తేదీన సీఎం వైయస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అనాథలకు, వృద్ధులకు, పేదలకు దుస్తుల పంపిణీ, అన్నదానం, సర్వమత ప్రార్థనలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు వైయస్‌ఆర్ సీపీ పిలుపునిచ్చింది. కోవిడ్ నిబంధనలను విధిగా పాటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించింది.
కేంద్ర కార్యాలయంలో..
సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకొని 21వ తేదీన తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటుతో పాటు అనాథలకు, పేదలకు దుస్తుల పంపిణీ చేయనున్నారు. అదే విధంగా వికలాంగులకు దుప్పట్ల పంపిణీ చేయనున్నారు.