రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేష‌న్‌

రాష్ట్రంలో ఇక‌పై మ‌న స్లోగ‌న్ ఇదే

 అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

ప్ర‌తి ప్ర‌భుత్వ బ‌డిలో ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెట్టిన మొద‌టి రాష్ట్రం దేశంలోనే మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టిది. కానీ ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెడుతూ జీవో పాస్ అయిన నాటి నుంచి టీడీపీలో ఉలిక్కిపాటు మొద‌లైంది. ఆ రోజు నుంచి ప్ర‌భుత్వం మీద ఒక ర‌కంగా చెప్పాలంటే ఒక సామాజిక దాడి మొద‌లైంది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ‌పెట్ట‌కుండా ఉండాలని ఈనాడులో వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురించారు. పేద‌ల పిల్ల‌లు ఇంగ్లిష్ చ‌దువుకుని ఉన్న‌తంగా స్థిర‌ప‌డాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తుంటే.. వీళ్లు మాత్రం ఎలాగైనా అడ్డుకోవాల‌ని ఒక యుద్ధం చేస్తున్నారు. వ‌రుస‌పెట్టి ఈనాడు ప‌త్రిక‌లో మొద‌టి పేజీలో బ్యాన‌ర్ స్టోరీలు ప్ర‌చురించారు. ఇంగ్లిష్ మాధ్య‌మాన్ని నేను అడ్డుకోలేద‌ని గింజుకునే చంద్ర‌బాబు, బ‌య‌ట పెట్ట‌మ‌ని స‌వాల్ చేసిన చంద్ర‌బాబు 16.11.2019న తుగ్లక్ చ‌ర్య‌ల‌ను తూర్పారా ప‌ట్టండి అని ఇచ్చిన స్టేట్‌మెంట్ చూసుకోవాలి. ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు ప‌త్రిక‌ల్లో తండ్రీకొడుకులు వ‌రుస‌పెట్టి వార్త‌లు రాయించి అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో యూట‌ర్న్ తీసుకున్నాడు. న‌వంబ‌ర్ 22న యూట‌ర్న్ తీసుకున్నాడు. న‌వంబ‌ర్ 22న ఆంధ్రం ఆంగ్లం రెండూ అవ‌స‌ర‌మే అంటూ స‌న్నాయి నొక్క‌లు నొక్క‌డం మొద‌లు పెట్టాడు.
 
అధికారంలో ఉన్న అయిదేళ్లు ఏం చేసిన‌ట్టు
న‌వంబ‌ర్ 26న మాతృభాష‌పై మాట్లాడితే ప్ర‌ధానిని కూడా త‌ప్పు ప‌డ‌తారేమోన‌ని మ‌ళ్లీ మొద‌లెట్టాడు. ఐదు సంవ‌త్స‌రాలు ప‌రిపాల‌న చేసే అవ‌కాశం ప్ర‌జ‌లు క‌ల్పిస్తే.. ఇంగ్లిష్ మీడియం తీసుకురాలేక‌పోయాడు. 66% గ‌వ‌ర్న‌మెంట్ స్కూళ్ల‌లో ఇప్ప‌టికీ తెలుగు మీడియం కొన‌సాగుతోంది. అదే ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు చూసుకుంటే కేవ‌లం 28% స్కూళ్ల‌లోనే ఇంగ్లిష్ మీడియం బోధ‌న సాగుతోంది. కానీ ప్రైవేటు స్కూళ్లు చూస్తే 94 శాతం ఇంగ్లిష్ బోధ‌న చేస్తున్నాయి. ఆనాడు ఎలాగైతే ప్ర‌త్యేక హోదా విష‌యంలో యూట‌ర్న్‌లు తీసుకున్నారో ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం విష‌యంలోనూ అదే చేస్తున్నారు. 

అయిదేళ్ల‌లో 6 వేల స్కూళ్లు మూసేశాడు

చంద్ర‌బాబునాయుడు కొడుకు లోకేష్‌, అచ్చెన్నాయుడు కొడుకు ఇంగ్లిష్ మీడియంలో చ‌ద‌వలేదా. ప‌త్రిక‌లు న‌డిపే యాజ‌మాన్యాలు కూడా వాళ్ల పిల్ల‌ల్ని ఇంగ్లిష్ లోనే చ‌దివిస్తున్నారు. ఈనాడు న‌డిపే ర‌మాదేవి ప‌బ్లిక్‌ స్కూల్ కూడా ఇంగ్లిష్ మీడియంలోనే న‌డుస్తోంది. రేష‌న‌లైజేష‌న్ పేరుతో 2014-19 మ‌ధ్య‌లో 6 వేల స్కూళ్ల‌ను మూసేశారు. కనీస వ‌స‌తులుండ‌వు. అక్టోబ‌ర్ వ‌చ్చినా పిల్ల‌లు యూనిఫాంలు, పుస్త‌కాలు రావు. ఆరు నెల‌ల‌పాటు మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లులు రావు, వంట మ‌నుషుల‌కు జీతాలివ్వ‌రు. ఇదంతా గ‌వ‌ర్నమెంట్ స్కూళ్ల‌ను నిర్వీర్యం చేసే కుట్ర.పేదవాడు సంక్షేమం గురించి ఆలోచ‌న లేని వ్య‌క్తి వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టుప‌ట్టించిన వ్య‌క్తి చంద్ర‌బాబే. అందుకే చెబుతున్నా రైట్ ఎడ్యుకేష‌న్ కాదు.. మ‌న రాష్ట్రంలో ఇక‌పై రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేష‌న్ స్టోగ‌న్ రావాలి.

* 44 వేల స్కూళ్ల‌ను మార్చ‌బోతున్నాం*
నాడు నేడు కార్య‌క్ర‌మం ద్వారా 44వేల స్కూళ్ల‌ను రెండేళ్ల‌లో మార్చ‌బోతున్నాం. చంద్ర‌బాబు అయిదేళ్లు పాల‌న చేసి క‌నీసం రూ. 50 కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేదు. మేము నాడు -నేడు కార్య‌క్ర‌మం ద్వారా రెండేళ్ల‌లో మూడు ఫేజుల్లో 44 వేల స్కూళ్ల‌ను మార్చ‌బోతున్నాం. మొద‌టి ఫేజ్‌లో 17,715 స్కూళ్ల‌లో మౌలిక వ‌సతులు క‌ల్ప‌న‌కు రూ. 3,600 కోట్లు కేటాయిస్తున్నాం. జ‌న‌వ‌రి 1 నుంచి అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌బోతున్నాం. మ‌న పిల్ల‌లు ప్ర‌పంచంతో పోటీప‌డేలా స్కూళ్ల‌ను మార్చుబోతున్నాం. విద్యావ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులు చేస్తున్నాం. ప్ర‌తి మండ‌లంలో ఒక జూనియ‌ర్ కాలేజీని ఏర్పాటు చేస్తాం. దేశ‌విదేశాల్లో మ‌న పిల్ల‌ల‌కు గుర్తింపు ద‌క్కుతుంద‌ని విశ్వ‌సిస్తున్నాం కాబ‌ట్టే ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెడుతున్నాం. 

అవాంత‌రాలు వ‌స్తాయ‌ని తెలుసు..
మేం తీసుకున్న ఈ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్నాం. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకు అనుగుణంగానే చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.  టీచ‌ర్లకు శిక్ష‌ణ, అవ‌స‌రానికి అనుగుణంగా సిల‌బ‌స్ మార్పు చేయ‌బోతున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న నిపుణుల‌తో చ‌ర్చించాం. ప్రోగ్రామ్ రూపొందించుకున్నాం. ఒక‌టి నుంచి ఆరో త‌ర‌గ‌తి దాకా వ‌చ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెడుతున్నాం. ఫ‌స్ట్ సెకండ్ క్లాస్‌ల‌కు 10 వారాల‌పాటు జూన్ 2020 నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు బ్రిడ్జ్ కోర్సుల‌ను రూపొందించాం. థ‌ర్డ్‌, ఫోర్త్ క్లాసుల‌కు 8 వారాల‌పాటు జూన్‌, జూలై నెలల్లో, ఐదు, ఆరు క్లాసుల‌కు ఏప్రిల్‌, మే నెలల్లో ఇంటెన్సివ్ బ్రిడ్జ్ కోర్సులు ప్ర‌వేశ‌పెడుతున్నాం. దేవుడి ద‌య‌వ‌ల్ల నాకు మంచి మంత్రి, స‌త్తా ఉన్న అధికారులు ఉన్నారు. మా ఛాలెంజ్‌ను చిత్త‌శుద్ధితో నెర‌వేర్చి విద్యావ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకొస్తాం. 

Read Also:అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి ఇదే సీఎం లక్ష్యం

Back to Top