అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి ఇదే సీఎం లక్ష్యం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
 

 

అసెంబ్లీ: రాష్ట్ర ప్రజలకు సమస్యలు ఉండకూడదని, రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు.  అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. ‘సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్ర అభివృద్ధిని తన భుజాన వేసుకొని మోస్తున్నారు. నవరత్నాలు తీసుకువచ్చి ప్రజానాయకుడిగా ఎదిగారు. ప్రాథమిక విద్య ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం బోధనను తీసుకువచ్చారు. ఆ తరువాత సంవత్సరం నుంచి ఒక్కొక్క తరగతి పెంచుకుంటూ దాన్ని ఇంగ్లిష్‌ మీడియం బోధనను పదో తరగతి వరకు తీసుకెళ్లనున్నారు. ఇంగ్లిష్‌ మీడియం నచ్చని కొన్ని శక్తులు కొత్త సిద్ధాంతాన్ని తీసుకువచ్చారు. ఇంగ్లిష్‌ మీడియం చదివే వాళ్లు క్రిస్టియన్స్‌ అయిపోతారని మతం రంగు పులిపి విషప్రచారం చేస్తున్నారు. అమరావతి తిష్టవేసిన సంపన్నులు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ఉన్న మేధావులు, శాస్త్రవేత్తలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవలేదా..? వీళ్లంతా క్రిస్టియన్లు అయిపోయారా..? బడుగు, బలహీనవర్గాలు ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే సమానత్వం అనే భావన వస్తుందని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి అనేది సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు.

Read Also: ఇంగ్లీష్‌ మీడియం అమలైతే తెలుగు భాష కాదు..టీడీపీ అంతం 

తాజా వీడియోలు

Back to Top