మా కేబినెట్‌లో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే

- అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

ప్ర‌తి అంశాన్నిదారుణంగా వ‌క్రీక‌రించే గుణం చంద్ర‌బాబు అండ్ కో కి త‌ప్ప ఇంకెవ‌రికీ ఉండ‌దు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో 50% శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తూ చ‌ట్టం చేసిన ఒకే ఒక్క శాస‌న‌స‌భ మ‌న‌ది అని గ‌ర్వంగా చెబుతున్నా. మ‌హిళ‌లు, బీసీ, ఎస్సీ, ఎస్సీల‌కు 50% రిజ‌ర్వేష‌న్ ఇచ్చాం. మార్కెట్ క‌మిటీలు, ఆల‌యాలు, డీసీసీబీలు ఇలా ప్ర‌తి నామినేటెడ్ పోస్టుల్లో చైర్మ‌న్లు, స‌భ్యులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీల‌నే నియ‌మించాం. మ‌హిళ‌ల‌కు చైర్మ‌న్ ప‌ర్స‌న్‌లుగా నియ‌మించాం. జ‌క్కంపూడి రాజాను కాపు కార్పొరేష‌న్‌, ఆర్కే రోజాను ఏపీఐఐసీకి చైర్‌ప‌ర్స‌న్‌, తెలుగు అకాడ‌మీకి చంద్రబాబు గారి అత్త ల‌క్ష్మీపార్వ‌తిని నియ‌మించాం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు పూర్తయ్యాక ఖాళీలున్న మ‌రో 160 పోస్టుల‌ను నియ‌మించి ఇదే అసెంబ్లీలో ప్ర‌క‌టిస్తాం. స‌ల‌హాదారుల పోస్టులు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని నియమించుకుంటాం. దానికి కులాలు, మ‌తాల‌ను అంట‌గ‌ట్ట‌డం స‌రికాదు. ప్ర‌భుత్వం అవ‌స‌రాల మేర‌కు స‌ల‌హాదారుల‌ను నియ‌మించుకుంటుంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా కుటుంబ‌రావును నియ‌మించుకుంటే సామాజిక అంశాన్ని తెర‌పైకి తెచ్చి ఆరోజు మేం ప్ర‌శ్నించ‌లేదు. నా కేబినెట్‌లో కూడా 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నారు. ఐదు మంది డిప్యూటీ ముఖ్య‌మంత్రుల్లో న‌లుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి ద‌ళిత మ‌హిళ‌, విద్యాశాఖ మంత్రి ఒక మాదిగ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి, రెవెన్యూ మంత్రి సుభాష్ చంద్ర‌బోస్ బీసీ అని గ‌ర్వంగా చెబుతున్నా. 

Read Also: బెదిరింపులే బాబు అనుభవం

Back to Top