ఆరోగ్యం జాగ్రత్త అక్కా...

ఎమ్మెల్యే కళావతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పరామ‌ర్శ‌

 తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వ‌స‌రాయి క‌ళావ‌తిని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ కోలుకుంటున్నారు. ఈ క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అక్కా.. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని ఆప్యాయంగా సూచించారు. ఇంకా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి.మీకు నేనున్నాంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యే క‌ళావ‌తికి ధైర్యం చెప్పారు.

Back to Top