దీపాలు వెలిగిద్దాం

 సీఎం వైయస్‌ జగన్‌ 
 

తాడేపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు మద్దతివ్వాలని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు. రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి దీపాలు వెలిగించాలని సీఎం వైయస్‌ జగన్ సూచించారు. దీపాలు వెలిగించే ముందు ఆల్కాహాల్‌ ఆధారిత శానిటైజర్లు వాడొద్దని సీఎం వైయస్‌ జగన్ అన్నారు. శానిటైజర్లు చేతులకు రాసుకొని దీపాలు వెలిగించడం వల్ల మంటలంటుకునే ప్రమాదం ఉందని, తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం వైయస్‌ జగన్ ప్రజలకు సూచించారు.

Back to Top