సీఎం స‌హాయ‌నిధికి రూ. కోటి 5 ల‌క్ష‌ల విరాళం

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్‌ గ్రానైట్స్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ (జెమ్‌ గ్రానైట్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ) రూ. 1,05,00,000 విరాళం అంద‌జేశారు. కోవిడ్‌ – 19 నివారణకు సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌ తీసుకున్న సమర్ధవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా సీఎంకి జెమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ ఆర్‌. వీరమణి వివ‌రించారు. 
విరాళానికి సంబంధించిన డీడీని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌కు  జెమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ ఆర్‌. వీరమణి, జెమ్‌ గ్రానైట్స్‌ డైరెక్టర్‌ ఆర్‌.గుణశేఖరన్ అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Back to Top