చిత్తూరులో బరితెగించిన టీడీపీ నేతలు

 

చిత్తూరు: జిల్లాలో టీడీపీ నేతలు కత్తులతో వీరంగం సృష్టించారు. వైయ‌స్సార్‌సీపీ కార్యకర్తల కుటుంబాల మీద కత్తులతో దాడులు చేశారు. ఈ ఘటన కేవీ పల్లి మండలం తిమ్మాపురంలో జరిగింది. టీడీపీ నేతల దాడిలో వైయ‌స్సార్‌సీపీకి చెందిన 10 మంది గాయపడ్డారు. దారుణం ఏంటంటే వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. 

వివరాలు.. పంచాయితీ ఎన్నికల్లో తిమ్మాపురంలో టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలిచాడు. దాంతో బరితెగించిన తెలుగుదేశం నేతలు వైయ‌స్సార్‌సీపీ శ్రేణుల కుటుంబాలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ద్వారక, ఆనంద్‌లతో పాటు మరో 50 మంది ఈ రోజు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముద్దుకృష్ణ ఇంటితోపాటు మరో నాలుగు కుటుంబాల మీద దాడులు చేశారు. కత్తులు, ఇనప రాడ్లతో దాడులు చేయడంతో 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం వీరందరిని పీలేరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top