చిత్తూరు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

చిత్తూరు: జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు చేరుకున్నారు. డీఎస్‌ఏ స్టేడియంలో హెలికాఫ్టర్‌ దిగిన జననేతకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో సీఎం వైయస్‌ జగన్‌ పీవీకేఎన్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా స్థలికి చేరుకోనున్నారు. మొదట కాలేజీలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

 

Back to Top