వైయ‌స్ జ‌గ‌న్ స్ఫూర్తితో అసెంబ్లీ స‌మావేశాలు

 చీఫ్ విప్ శ్రీకాంత్‌ రెడ్డి
 

అమ‌రావ‌తి:    వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన తీరు ఏవిధంగా ఉందో.. అసెంబ్లీ కూడా అదే స్ఫూర్తితో కొనసాగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కిందనీ.. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి అడ్డగోలుగా కొనుగోలు చేశారని ఆయన గుర్తు చేశారు. అధికార పక్షం చెప్పినట్లు ఆడుతూ.. స్పీకర్ పదవికే కోడెల మచ్చ తెచ్చారని విమర్శించారు. ఈ సమావేశాలు ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగానికే పరిమితమౌతుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. త్వరలో జరిగే మరో సమావేశాల్లో పారదర్శకతే అజెండాగా ఉంటుందన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top