మ‌ల్లెల బాబ్జీ లేఖ‌పై చంద్ర‌బాబు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి
 

అమ‌రావ‌తి: మ‌ల్లెల బాబ్జీ ఆత్మ‌హ‌త్య చేసుకునే స‌మ‌యంలో చంద్ర‌బాబుకు రాసిన లేఖ‌కు ఆయ‌న స‌మాధానం చెబుతారా అని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి నిల‌దీశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌ను శ్రీ‌కాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్ర‌వారం వ్య‌వ‌సాయం జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..వ్య‌వ‌సాయంపై చ‌ర్చ జ‌రుగుతుండ‌గా స‌భ ఎక్క‌డా కూడా ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా వ్య‌వ‌సాయ మంత్రి  క‌న్న‌బాబు మాట్లాడుతుండ‌గా ఒక స‌భ్యుడు లేచి ఓ పేప‌ర్ చూపించాడు. వెంట‌నే చంద్ర‌బాబు అడ్డుకోవాల్సింది పోయి న‌వ్వుతూ రెచ్చ‌గొట్టారు. స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బాబాయి గొడ్డ‌లి వేటు అంటు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ‌లో ఉంది. ధైర్యం ఉంటే  విచార‌ణ‌కు హాజ‌రు కండి..మీరు ఏర‌కంగా కుట్ర‌లు చేస్తున్నారో అన్ని బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఎవ‌రో ఒక మ‌నిషి పేరు చెప్ప‌డ‌ని చంద్ర‌బాబు అంటున్నాడు. మ‌ల్లెల బాబ్జీ తాను ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోతు లెట‌ర్‌లో ఏం రాశారో గ‌మ‌నించండి. లేఖ‌లోని అంశాలు నిజ‌మ‌వుతాయా?. ఎవ‌రో ఒక మాట మాట్లాడితే..దాన్ని ప‌ట్టుకొని ముఖ్య‌మంత్రిపై నింద‌లు వేస్తారా? . మ‌ల్లెల బాబ్జీ చంద్ర‌బాబు గురించి రాసిన లేఖ‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా అని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. అనుభ‌వం కాదు..నాయ‌కుడికి విజ్ఞ‌త‌, నిజాయితీ ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top