తాడేపల్లి: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ``అత్యవసర సమయాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించే సేవామూర్తులు నర్సులు. `ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న` అన్నట్లుగా ఎంతోమందికి జీవం పోసేప్రాణదాతలు వారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ శుభాకాంక్షలు`` తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.