రేణిగుంటకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

కాసేప‌ట్లో తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి ముఖ్యమంత్రి

తిరుపతి: రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొనేందుకు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి తిరుమ‌ల‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. కాసేప‌టి క్రిత‌మే రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, ఎంపీలు రెడ్డప్ప, డాక్టర్‌ గురుమూర్తి,  ఎమ్మెల్యేలు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘనస్వాగతం పలికారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి కాసేప‌ట్లో తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అలిపిరి చేరుకుని తిరుమలకు విద్యుత్‌ బస్సులను ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు. 

తాజా వీడియోలు

Back to Top