ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఆపన్న హస్తం..

మానవత్వంతో ఆర్థిక సాయం అందించాలన్న ముఖ్యమంత్రి

ఎనిమిది మందికి రూ. 9 లక్షలు ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్

శ్రీకాకుళం  : ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మరోసారి ఆపన్నులకు అండగా నిలిచారు. పలాసలో తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన పలువురు నుంచి వినతులు స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న వారికి మందులు, వైద్య, ఇతర అవసరాల కోసం వచ్చిన వినతుల పట్ల సానుకూలంగా స్పందించిన జగన్మోహన్ రెడ్డి బాధితుల పట్ల మానవత్వంతో స్పందించాలని ఉదారంగా ఆదుకోవాలని అక్కడే ఉన్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో శుక్రవారం ఉదయం 8గురికి కలిపి రూ.9 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. 

ఆర్థిక సహాయం అందుకున్న వారిలో..
పొందూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన బోను సంతోషి గత 10 సంవత్సరాల నుండి తేలికపాటి పక్షవాతం, తీవ్రమైన చర్మవ్యాధి ఉందని  ఆర్థిక సాయం కోరడంతో ఆమెకు రూ.2.లక్షల సహాయం అందజేశారు.

పెద్ద శ్రీపురం సచివాలయ పరిధికి చెందిన  కిడ్నీ వ్యాధితో అనారోగ్యం పాలైన మేరపాటి తులసిదాసు నెలకు రూ.12,500 అవుతుందని ఆర్థిక సాయం కోసం కోరగా రూ.లక్ష అందజేశారు.

వంశపారంపర్య హైపర్ కొలోస్ట్రిమియా అనే కిడ్నీ వ్యాధితో అనారోగ్యం పాలైన సనపల హేమంత్ కుమార్ ఆరోగ్యశ్రీ లో కూడా తనకు చికిత్స అందజేయాలని కోరగా తక్షణ సహాయంగా అతడికి రూ.లక్ష చెక్కును కలెక్టర్ అందజేశారు.

రాజాం మండలానికి చెందిన అడపా యోగేశ్వరరావు గుండెలో రంధ్రాలు, జన్యుపరమైన సమస్యను 
ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స జరిగిందని,ఆర్థిక సాయం కొరకు  ముఖ్యమంత్రి కోరగా కలెక్టర్ రూ.1లక్ష చెక్కును అందజేశారు.

అలాగే వితిక (అధిక రక్తస్రావం) సాయికృష్ణ (మానసిక వ్యాధి) ఎం.సాత్విక్ (జన్యుపరమైన సమస్యలు, అధిక కొలెస్ట్రాల్)  కొమర పోలరాజు (ఊపిరితిత్తుల క్యాన్సర్ 4వ దశ)లు వివిధ అనారోగ్య కారణాలతో ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రిని అభ్యర్థించగా వారి ఆదేశాలతో కలెక్టర్ లాఠకర్ అందరికీ ఒక్కో రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త పి.ప్రకాశరావు, కొవ్వాడ ఎస్ డి సి తహసీల్దార్ బి.వి.రమణ, డి-సెక్షన్ సూపరింటెండెంట్ పి.అమల, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top