తూర్పుగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు చేసిన అపరాధాన్ని క్షమించమని కోరుకున్నట్లు ప్రకటించి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అలాగే, చంద్రబాబు చేసేవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి చెల్లుబోయిన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఉద్యోగులను భయభాంత్రులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను అన్యాయంగా సస్పెండ్ చేశారు. తాజాగా కాకినాడలో జనసేన ఎమ్మెల్యే సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. దాడి చేసి రాజీ చేసుకుంటే చట్టాల పట్ల ప్రజలకు నమ్మకం పోతుంది. చంద్రబాబు చేసిన అపరాధాన్ని క్షమించమని కోరుకున్నట్టు ప్రకటించి పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలి. టీటీడీ రిపోర్టు టీడీపీ ఆఫీసుకు ఎలా వచ్చింది. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. ప్రతిపక్షాలపై బురదజల్లడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.