ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట విషాదం

 తిరుపతి : ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి (మణిరెడ్డి–76)  సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందారు. శ్వాస సంబంధ సమస్యతో గత కొంతకాలంగా ఆయన ఇబ్బందిపడుతున్నారు.  సోమవారం రాత్రి  ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో  స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.  రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.  

సుబ్రమణ్యంరెడ్డికి ముగ్గురు కుమారులు. వారిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రథమ సంతానం. సుబ్రమణ్యంరెడ్డి ఉమ్మడి  ఏపీలో కాంగ్రెస్‌  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలకు చైర్మన్‌గా పనిచేశారు.  పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫోన్‌ ద్వారా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పరామర్శించారు.   

Back to Top