చంద్రబాబుకు చికిత్స అవసరం

ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌: ఎన్టీయేతర పార్టీలకు ఆధిక్యత వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని రాష్ట్రపతికి లేఖ రాయాలని సోనియాకు చంద్రబాబు త్రిసూత్ర వ్యూహాన్ని వివరించారని కులమీడియా పారవశ్యంతో రాసిందని ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.త్రిసూత్ర ఏమో కాని క్షార సూత్ర అని ఆయుర్వేదంలో ఒక చికిత్స ఉంది.చంద్రబాబుకు అర్జెంట్‌గా ఆ చికిత్స అవసరం అని ట్విట్‌ చేశారు.

నకిలీ ఫెవికాల్‌తో బంధాలు అతకడంలేదు.
ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌తో అనుసంధానం చేయడానికి చంద్రబాబు అంబికా అగరుబత్తిలా పనిచేస్తున్నా ఒకడుగు ముందుకు..రెండడుగులు వెనక్కి పోతున్నాయని  ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాబు వాడుతున్న ఫెవికాల్‌(నకిలీ)ది కావడంతో బంధాలు ఒక పట్టాన అతకడం లేదట అని చలోక్తులు విసిరారు. ఢిల్లీకి రాలేమని మమత,మాయావతి,స్టాలిన్‌ చివరకు కుమారస్వామి కూడా చెప్పేశారట..అని పేర్కొన్నారు.
 

Back to Top