చంద్రబాబూ.. 40 ఏళ్ల అనుభవం ఇదేనా..?

సీఎస్‌పై నిందలు ఆపాలి 

చంద్రబాబు పాలనలో రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు

రాబోయే తరానికి తప్పుడు సంకేతాలు ఇవ్వొదు..

ఈ ఐదేళ్లు నిరంకుశ పాలన సాగింది..

చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారు

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం:సీఎస్‌పై చంద్రబాబు  నిందలు ఆపాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు.మంగళవారం ఆయన శ్రీకాకుళం వైయస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.సంబంధింత శాఖలపై సమీక్ష చేసే అధికారం సీఎస్‌కు ఉందని తెలిపారు.ఏపీలో ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని టీడీపీ వితండవాదన సరికాదన్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత అర్థం చేసుకోకుండా  చంద్రబాబు ఇతరులపై విరుచుకుపడుతున్నారన్నారు. సీఎస్‌ సహకరించడంలేదని నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యనించడం పట్ల తప్పుబట్టారు. నాలుగున్నరేళ్ల తర్వాత దేశంలో ఏ ఒక్కరూ ప్రశంసించని విధంగా మోదీని.. చంద్రబాబు ప్రశంసించారన్నారు.

బీజేపీతో ఉన్న రోజులు కూడా ప్రధానిని పొగిడారని అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి.. ఢిల్లీ వెళ్ళి ఘనంగా సన్మానించారని తెలిపారు. చంద్రబాబు అసహనంతో  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దూషిస్తూ మాట్లాడుతున్నారని, చివరికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపైనా విరుచుకుపడుతున్నారని దుయ్యబట్టారు.  చంద్రబాబు ప్రవర్తన చూస్తుంటే..40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేర్చుకున్నది ఇదేనా అని ప్రశ్నించారు. తన అనుభవాన్ని  గౌరవప్రదంగా తర్వాత తరం వారికి అందించి ఆదర్శంగా ఉండాల్సిన చంద్రబాబు.. అందరూ అసహ్యహించుకునే స్థితికి దిగజారారన్నారు.  సీఎస్‌ అనే పదవి గల వ్యక్తి సీఎం ఏం చెప్పితే అది చేయడానికి కాదని చంద్రబాబు ఇంతవరుకూ గ్రహించకపోవడం అశ్చర్యమేస్తుందన్నారు.

సీఎస్‌ ప్రభుత్వంలో కీలక వ్యక్తి అని, ముఖ్యమంత్రికి సలహాదారునికిగా పనిచేస్తారన్నారు. రాజ్యాంగ,చట్ట పరిధి నిబంధనలు వంటి అంశాలపై సలహాదారునిగా ఉంటారే తప్ప ముఖ్యమంత్రి చెప్పిన పనులన్నీ చేయడానికి  కాదన్నారు. సీఎస్‌ కొన్ని డిపార్ట్‌మెంట్లపై రివ్యూ నిర్వహిస్తే దానికి టీడీపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలియజేయడం పద్దతి కాదన్నారు. ముఖ్యమంత్రి ఆదేశించని సందర్భాల్లో కూడా  డిపార్ట్‌మెంట్‌ను సీఎస్‌ రివ్యూ చేయవచ్చన్నారు. కేబినెట్‌ మంత్రి ఒక అంశాన్ని రివ్యూ చేయమని కోరితే రివ్యూ చేసే అవకాశం రూల్‌ 17 ఇస్తుందన్నారు. సీఎస్‌ తను అంతట తానుగా ఒక డిపార్ట్‌మెంట్‌ను రివ్యూ చేయాలనుకుంటే సుమోటాగా నిర్ణయంగా తీసుకునే అధికారం రూల్‌ 17 కల్పించిందన్నారు. సీఎస్‌ చేస్తున్న సమీక్షలను చంద్రబాబు ఎందుకు తప్పుబడుతున్నారో రాష్ట్ట్ర ప్రజలకు అర్థం కావడంలేదన్నారు.

ఏ ప్రభుత్వంలో అయినా ముఖ్యమంత్రి,మంత్రులు,పౌరులు గాని, ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు  ప్రభుత్వ రూపొందించిన చట్టాలు, నిబంధనలు ప్రకారం చేస్తారన్నారు. ఒక చీఫ్‌ సెక్రటరీని నిందించడం ద్వారా ప్రజల మధ్య పలుచన అవుతారే తప్ప గౌరవం తెచ్చిపెట్టదన్నారు.ఎల్వీ సుబ్రహ్మణ్యం నిజాయతీ,నిబద్ధతం గల్గిన వ్యక్తి అని,తన బాధ్యతలను రాజ్యాంగ బద్ధంగా నిర్వహించే వ్యక్తిగా పేరున వ్యక్తి అని అన్నారు.సీఎస్‌ను నిందించి,ఆ బాధ్యతలను నుంచి తప్పించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు.చంద్రబాబు రాబోయే తరానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యదేశంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న యంత్రాంగం రాజ్యాంగ పరంగా పూర్తి అధికారం కలిగిఉంటుందన్నారు.

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని,అలా జరగకపోతే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు.ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తప్పక అధికారులు పాటిస్తారన్నారు.సీ ఎస్‌.. ఎన్నికల ఆదేశాలను పాటించాలా..కోడ్‌ వచ్చిన తర్వాత కూడా మీ ఆదేశాలను పాటించాలా అని చంద్రబాబును ప్రశ్నించారు.గడచిన ఐదు సంవత్సరాలు నిరంకుశ పాలన అందించారు.చంద్రబాబు చుట్టూ రాజ్యాంగ ఉల్లంఘనులు ఉన్నారన్నారు. ఐదేళ్లు నియంత పాలన సాగిందన్నారు.చంద్రబాబు అరాచకాలు కొకొల్లలుగా ఉన్నాయని తెలిపారు.  రాజ్యాంగం మీద చంద్రబాబుకు విశ్వాసం లేదని.. రాజ్యాంగ సంస్థలను రాష్ట్రంలో పనిచేయనివ్వలేదని ధ్వజమెత్తారు. స్పీకర్‌ను వ్యవస్థను నాశనం చేసి అబాసుపాలు చేశారన్నారు.

ఇతర రాజకీయ పార్టీల వారిని ప్రభుత్వంలో చేర్చుకుని దుర్వినియోగం చేశారన్నారు. యాంటి డిఫెక్షన్‌ యాక్ట్‌ అమలు కాకుండా నిలువనించారన్నారు.  కేపిటల్‌ సిటీ నిర్మాణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్‌ పాటించకుండా స్విస్‌ ఛాలెంజ్‌ పద్దతికి అప్పజెప్పారన్నారు. అన్యాయంగా ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారని విరుచుకుపడ్డారు. 40 సంవత్సరాల అనుభవం ఉందని శాసన సభలో తీర్మానం చేసి..గొప్ప అనుభవజ్ఞుడని మీకు మీరు రాయించుకున్నారు.మీ అనుభవం ఇదేనా..అంటూ చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. రాజ్యాంగం,చట్టాలు నిబంధనలు పట్టించుకోరన్నారు. చంద్రబాబు.. ఐఏఎస్‌ అంటే ఐ అగ్రి సార్‌ అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జూన్‌ 8 వరుకూ ముఖ్యమంత్రిని..ప్రభుత్వం నాదే అనంటూ చంద్రబాబు చెబుతున్నారని.ఇది తప్పు అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించారని మండిపడ్డారు.రాజ్యాంగ నిబంధనలు పరిశీలించాలన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top