అడ్వాన్స్‌ రోబో టెక్నాలజీ కోర్సులు అందించడమే సీఎం లక్ష్యం

 ఆంధ్రప్రదేశ్‌ సిల్క్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చల్లా మధుసూధన్‌ రెడ్డి 
 

విజయవాడ : విద్యార్థులకు అడ్వాన్స్‌ టెక్నాలజీ కోర్సులను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ సిల్క్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చల్లా మధుసూధన్‌ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 31 కాలేజీల్లో అడ్వాన్స్‌ రోబోటిక్‌ కోర్సును అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. విజయవాడలో గురువారం జరిగిన విలేకరులో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీ కోర్సుతో 1000 మంది విద్యార్థులు శిక్షణ పొందుతారని, ఇందుకోసం అర్క్‌ జర్మనీ టెక్నాలజీ వారు  ప్రత్యేకంగా కోర్సును నేర్పుతున్నట్లు పేర్కొన్నారు.  ఈ సమావేశంలో యురోపియన్‌ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ప్రెసిడెంట్ వివిఎన్ రాజ్ మాట్లాడుతూ..  దాదాపు 20 కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో ఈ కోర్సును అందిస్తున్నామన్నారు. దీంతో రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని రాజ్‌ తెలిపారు.  అర్క్‌ నేర్చుకున్న వారికి భవిష్యత్‌ ఉంటుందనే ఉద్దేశంతోనే జర్మనీ నుంచి ఏపీకి వచ్చామన్నారు. నిరుద్యోగ యువతకు టెక్నాలజీ ద్వారా ఉపాధి కల్పించటమే లక్ష్యంగా 31 కాలేజీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. విద్యార్థులను నైపుణ్యలుగా చేసేందుకు విద్యార్థి దశలోనే టెక్నాలజీపై అవగాహన కల్పిస్తే ఉపయోగం ఉంటుందన్నారు. ఇందుకోసం జర్మనీ ప్రభుత్వం సహకారంతో ఈ టెక్నాలజీని తెచ్చామని వివిఎన్‌ రాజ్‌ పేర్కొన్నారు.

Read Also: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు..

తాజా ఫోటోలు

Back to Top