యువజన, మహిళా విభాగం అధ్యక్షుల నియామకం

యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

మహిళా విభాగం అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణిలు

తాడేపల్లి:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం, రాష్ట్ర మహిళా విభాగానికి నూతన కమిటీల‌ నియామకం జరిగింది. కొత్తగా కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీచేశారు.   

యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్‌గాంధీ, పిన్నెళ్లి వెంకట్రామిరెడ్డిని నియమించారు.మొత్తం 64 మందితో నూతన కమిటీని నియమించినట్టు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. 

అదే విధంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర మహిళా విభాగానికి కూడా నూతన కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణిలు ఇద్దరినీ నియమించారు. అలాగే ఉపాధ్యక్షులుగా మంతెన మాధవీవర్మ, బండి పుణ్యశీల, డాక్టర్ శశికళను నియమించారు. మొత్తం 64 మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా వీడియోలు

Back to Top