వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులపై బైండోవర్‌ కేసులు

 లోకేష్‌ ఆదేశాలతోనే తప్పుడు కేసులు

పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు

పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి 

అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులపై బైండోవర్‌ కేసులు నమోదు చేయడంపై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు,విద్యార్థులపై కేసుల పేరుతో పోలీసుల వేధింపులకు గురిచేయడం దారుణమని మండిపడ్డారు. బాధితులతో కలిసి పీఎస్‌కు వచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల మాట్లాడుతూ మంత్రి లోకేష్‌ ఆదేశాలతో తప్పుడు కేసులను పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.అర్ధరాత్రి ఇళ్లకు వెళ్ళి పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.  ఒక్క తాడేపల్లి గ్రామంలో 260 మందిపై కేసులు నమోదు చేశారు.

 

Back to Top