బడుగు వర్గాలను అక్కున చేర్చుకున్న జగనన్న

సామాజిక సాధికార బస్సు యాత్ర.

గుంటూరు తూర్పు నియోజకవర్గం, గుంటూరు జిల్లా.

రాష్ట్రంలో అంబేద్కర్‌ భావజాలం ముందుకెళ్తోంది: మంత్రి మేరుగ నాగార్జున

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధికారమిచ్చిన జగనన్న: మంత్రి ఆదిమూలపు సురేష్‌

బీసీల బంధువుగా కులగణన చేయాలని జగన్‌ నిర్ణయం: మంత్రి చెల్లుబోయిన

ఓటు బ్యాంకు అనుకున్న వర్గాలను తలెత్తుకునేలా చేసిన జగనన్న: ఎంపీ మోపిదేవి

మహిళలకు 31 లక్షల ఇంటిస్థలాలిచ్చిన నంబర్‌ 1 సీఎం జగన్‌: ఎమ్మెల్యే ముస్తఫా

మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైయస్సార్‌ దే: ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర. 

అడుగడునా బ్రహ్మరథం పట్టిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు. 

గుంటూరు ఈస్ట్‌: అనాదిగా నిరాదరణకు గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను సీఎం వైయస్‌ జగన్‌ అక్కున చేర్చుకున్నారని నేతలు కొనియాడారు. సామాజిక సాధికారత దిశగా అడుగులు వేయించి రాజ్యాధికారంలో ఎస్టి,ఎస్సి,బిసి,మైనారిటీలను భాగస్వాముల్ని చేశారని చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్ర  గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ర్ట మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ,  ఆళ్ళ ఆయోధ్యరామిరెడ్డి,జడ్ పి ఛైర్మన్ క్రిష్టినా,ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, హఫీజ్‌ ఖాన్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్,పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం,నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు,పార్టీ విద్యార్ది విభాగం రాష్ర్ట అధ్యక్షుడు పానుగంటి చైతన్య ముఖ్య నేతలు పాల్గొన్నారు. నేతలు ఏం మాట్లాడారంటే..

 

మేరుగ నాగార్జున, మంత్రి.

 

– అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మౌలానా అబుల్‌కలామ్‌ ఆజాద్‌ లాంటి ఉద్ధండులు సామాజిక విప్లవం కోసం ఉద్యమాలు చేశారు. 

– రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలను అక్కున చేర్చుకోలేదు. 

– ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న సామాజిక విప్లవానికి తెరతీశారు. 

– 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎస్సీలను తక్కువగా చూశారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. అసమానతలు, వెలివేతలు చూశాం. రాజ్యాంగ హక్కులను కాలరాశారు. 

– జగనన్న కులం, ప్రాంతం, మతం, పార్టీ చూడటం లేదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఎదుగుదల, సంక్షేమం, అభివృద్ధిని సాకారం చేస్తున్న సీఎం జగనన్న.

– ఒక్క పైసా అవినీతి లేకుండా రూ.2.35 లక్షల కోట్లు ఈ కులాలకు నేరుగా అందించారు. ఆశ్రిత పక్షపాతం లేదు. అర్హతే ప్రామాణికంగా పేదలందరికి సాయం చేశారు. 

– ఇంగ్లీష్‌ మీడియం చదువులు తెచ్చింది జగనన్న. 

– అనారోగ్యం వస్తే దేశంలో ఎక్కడైనా చూపించుకొనే అవకాశం కల్పించింది జగనన్న.

– పేద అక్కచెల్లెమ్మలకు 31 లక్షల ఇంటి పట్టాలిచ్చింది జగనన్న.

– రాష్ట్రంలో అంబేద్కర్‌ భావజాలం ముందుకెళ్తోంది. 

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ముందెన్నడూ లేని విధంగా లబ్ధి పొందుతున్నారు. 

 

ఆదిమూలపు సురేష్, మంత్రి.

 

– సమాజంలో అట్టడుగు వర్గాలకు సామాజిక సాధికారత కల్పించిన జగనన్న. 

– మైనార్టీలకు వైయస్సార్‌ ఇచ్చిన రిజర్వేషన్‌ సాక్షిగా జగనన్న అందించిన పాలన చూస్తున్నాం. 

– 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి దేశంలో 22వ స్థానంలో ఉండేది.

– ఈరోజు స్థూల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. 

– తలసరి ఆదాయంలో టీడీపీ హయాంలో ఏపీ 17వ స్థానంలో ఉంటే నేడు 9వ స్థానంలోకి వచ్చాం. సంపద అందరికీ పంచడం వల్లనే ఇది సాధ్యమైంది. 

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అధికారం దిశగా నడిపించిన జగనన్న. 

– అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి టీడీపీ వాళ్లు విషం చిమ్ముతున్నారు. పచ్చపత్రికల్లో అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.

– మన కులాలకు జరిగిన మంచికి సాక్ష్యం ఈరోజు వేదికపై ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 

– రాజ్యసభలో ఏపి నుంచి పార్టీ తరపున సగానికి సగం ఎంపీస్దానాలు బీసీలకు ఇచ్చింది జగనన్న. రెండింతల మందికి లోక్‌సభలో స్థానం కల్పించారు.

– ఇంగ్లీష్‌ మీడియం, ఉద్యోగాలు ఇచ్చిన జగనన్న అభినవ జ్యోతిరావుపూలే.

 

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి.

 

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏ ఒక్కరూ చేయి చాచాల్సిన అవసరం లేదు. ఎక్కడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పని లేదు. 

– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మరక్షకుడు జగనన్న. 

– జగనన్న ఆరోగ్య సురక్షతో జబ్బులను జల్లెడ వేసి పట్టేస్తూ వాటికి తగిన చికిత్స చేయిస్తున్న జగనన్న.

– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బంధువుగా రాష్ట్రంలో కులగణన చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. 

– ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్నారు. మత్స్యకారుల తోలు తీస్తానన్నాడు. నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానన్నాడు. మైనార్టీలకు  మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. 

– మన నాయకుడు జగనన్న ఉపముఖ్యమంత్రి పదవి మైనార్టీలకు ఇచ్చారు.

– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేద నాయకులు నాయకత్వం వహించాలని జగనన్న చెప్పారు. 

 

మోపిదేవి వెంకటరమణ, ఎంపీ.

 

– 2019లో జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. 

– పేదలు పేదరికంలో మగ్గకూడదని ఇంటి స్థలాలు ఇచ్చారు.

– ఆకలి బాధ ఉండరాదని, ప్రతి వ్యక్తీ ఆర్థికంగా నిలదొక్కుకొనేలా జగనన్న చేశారు.

– ఓటు బ్యాంకుకే పరిమితమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని రకాలుగా తలెత్తుకొనే తిరిగేలా చేసిన జగనన్న.

– రాజకీయంగా చైతన్యవంతులుగా చేస్తూ ఈ వర్గాలను అందలం ఎక్కించారు. 

– గత టీడీపీ పాలనలో రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే వ్యాపారస్తులను తీసుకొచ్చి రూ.50 కోట్లు, రూ.100 కోట్లకు బేరాలు పెట్టి అమ్ముకున్న దాఖలాలు చూశాం. 

– పార్టీని నమ్ముకున్న బీసీ వర్గాలకు చెందిననలుగురికి రాజ్యసభ సీట్లు ఇచ్చిన జగనన్న.

– బీసీ సామాజిక వర్గాలకు రాజకీయంగా అత్యున్నత స్థానం కల్పించిన జగనన్న.

– రాష్ట్రంలో కేరాఫ్‌ అడ్రస్‌లేని చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడు.

– 2024లో మరోసారి జగనన్నే రాష్ట్రానికి సీఎంగా రావాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మరింత మేలు జరగాలి. 

 

ముస్తఫా, ఎమ్మెల్యే.

 

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేస్తున్న జగనన్న.

– ఆర్థిక ఇబ్బందులున్నా వెనకడుగు వేయలేదు. ఎన్నో పథకాలు రూపొందించి పేదరికం రూపుమాపే దిశగా రాష్ర్టాన్ని నడిపిస్తున్నారు.

– జగనన్న ఆరోగ్య సురక్షతో రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని క్యాంపులు  పెట్టారు.

– దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి మందికి ఇళ్లస్థలాలు ఇచ్చారు.

 

హఫీజ్‌ ఖాన్, ఎమ్మెల్యే.

 

– జగనన్న ప్రజలకు ఏమి మేలు చేస్తున్నారనేది ... హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్న పవన్, చంద్రబాబు, లోకేష్‌ లకు అర్థం కాదు. 

– ఎండలో చెమటోడ్చి పిల్లల కోసం కష్టపడే వారికి జగనన్న ప్రభుత్వం విలువ తెలుస్తుంది. 

– మైనార్టీలకు రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత వైయస్సార్‌ దే.

– మనకు అంటే మైనారిటీలకు మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవులు కూడా ఇవ్వని చంద్రబాబు. 

– మైనార్టీలకు డిప్యూటి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన జగనన్న. 

– మైనార్టీల పిల్లల చదువులకు కూడా సాయం చేస్తున్నారు.

– వైయస్సార్‌ను హృదయంలో పెట్టుకున్నట్లే జగనన్నను ఎస్సి,ఎస్టి, బిసి,మైనారిటీలు కాపాడుకోవాలి.

Back to Top