న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు రావల్సిన స్థానిక సంస్థల గ్రాంట్లను ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, నీతి ఆయోగ్ ప్రతినిధులను ఆయన కలిశారు. ఆంద్రప్రదేశ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై వినతి అందజేశారు. అనంతరం ఏపి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు తెలిపారు. ఏపికి రావల్సిన స్థానిక సంస్థల గ్రాంట్లను ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. స్థానిక సంస్థలకు రూ.5 వేల కోట్లకు పైబడి గ్రాంట్లు రావాల్సి ఉందని, దాన్ని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. రెండేళ్లుగా గ్రాంట్లు లేకపోయినా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించిందని తెలిపారు. కేంద్రం నుంచి గ్రాంట్లు రాకపోవడంతో రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడిందన్నారు. గత ప్రభుత్వం దాదాపు రూ.60 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టిందని, ఏడాది పైగా కాలపరిమితితో అన్ని రకాల పనుల కాంట్రా క్టులు, సప్లై కాంట్రాక్టులు, ఔవుట్ సోర్సిం గ్‌లు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు ఇలాంటివన్నీ పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. దీంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొందని అన్నా రు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సి న నిధులు చాలా ముఖ్యమని పేర్కొ న్నారు. పోలవరం బకాయిలు ఇవ్వండి పోలవరం ప్రాజెక్టుకు నిధులు నాబార్డు నుంచి రాష్ట్రానికి నేరుగా వచ్చేలా చూడాలని కోరామని, అందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే ప్రక్రియతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు.