విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలనకు ఆకర్శితులై పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇతర పార్టీల నుంచి వందలాది మంది వైయస్సార్‌సీపీలో చేరుతున్నారు. నిన్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు కాశీ విశ్వనాథం సహా వంద మందికి పైగా టీడీపీ నేతలు పార్టీలో చేరారు. ఇవాళ జనసేన నాయకుడు, విశాఖ 26వ వార్డు నేత హరికృష్ణ నేతృత్వంలో 300 మంది, 25వ వార్డు నుంచి సిహెచ్ వెంకట రమణ, అప్పలరాజు, ఈశ్వర్‌రావు, లక్ష్మీకాంతం, శంకర్‌రావు తదితరులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. అలాగే బీజేపీకి చెందిన వరలక్ష్మీ ఆధ్వర్యంలో నార్త్ అసెంబ్లీకి చెందిన 200 మంది వైయస్ఆర్‌సీపీలో చేరారు. మాధవస్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వైయస్సార్ సీపీలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.