ప్రజలకు వైయ‌స్‌ జగన్‌ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు 

తాడేపల్లి: 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలుగు ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.  

‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ సార్వభౌమత్వాన్ని ఘనంగా జరుపుకుందాం. ఐక్యత, అభివృద్ధికి ప్రేరణనిస్తూ జాతీయ జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్’ అని పేర్కొన్నారు. 

Back to Top