చిరస్మరణీయులు అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు 

త్యాగధనుడికి వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఘన నివాళి

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం

తాడేపల్లి: తెలుగుజాతి ఒక్కటిగా కలిసుండాలని, తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు, వారికి ఒక రాష్ట్రం కావాలని తలంచి, అందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు తెలుగుజాతి ఉన్నంత వరకు చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
    ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాకు మహనీయుడి పేరు పెట్టడం ద్వారా వైయస్సార్, నవంబర్‌ 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా వైయస్‌ జగన్‌..  పొట్టి శ్రీరాములును గౌరవిస్తే, చంద్రబాబు మాత్రం అనుక్షణం వారిని అవమానించారని చెప్పారు. నవంబరు 1న జరిగే రాష్ట్ర అవతవరణ దినోత్సవాన్ని, రాష్ట్రాన్ని విభజించిన జూన్‌ 2వ తేదీకి మార్చి ఆ మహనీయుడిని అవమానించాడని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు గుర్తు చేశారు. అంతే కాకుండా ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుకు రూ.1750 కోట్లు వెచ్చిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహానికి, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కేటాయించకుండా చిన్న చూపు చూసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులను వ్యాపారాలు చేసుకోనివ్వకుండా జీఎస్టీ తనిఖీల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారని ఆక్షేపించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏమన్నారంటే..:

అమరజీవి ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా జగన్‌గారు.
:లేళ్ల అప్పిరెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్‌. ఎమ్మెల్సీ.

– దేశ చరిత్రలోనే భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి, 58 రోజులుఆమరణ నిరాహార దీక్ష చేసిన మహనీయుడు. నిజానికి అలాంటి గొప్ప వ్యక్తి, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఉండి ఉండడు. అలాంటి మహనీయుడి జయంతిని ఈరోజు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తోంది. ఆ మహానుభావుడి ఆలోచనలు, ఆశయాలు కానీ చాలా గొప్పవి. రాష్ట్రం కోసం శాంతియుతంగా ఆమరణ దీక్ష చేయడం చాలా త్యాగనిరతి. రాష్ట్రం కోసం ఆయన చేసిన దీక్ష, ప్రాణత్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయనను తల్చుకున్నప్పుడల్లా ప్రతి ఆం«ధ్రుడి హృదయం చలిస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లో కొందరు నాయకులు మాటలు, చేతలు చూస్తుంటే, ఆశ్చర్యం కలుగుతుంది. అధికారమే పరమావధిగా వాళ్లు చేస్తున్న రాజకీయాలు అనైతికం. ఆ మహనీయుడు పొట్టి శ్రీరాములు ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ పని చేస్తున్నారు. అదీ రాష్ట్రంపై, ప్రజలపై జగన్‌గారికి ఉన్న చిత్తశుద్ధి. అలాగే విలువలు, విశ్వసనీయతకు జగన్‌గారు ప్రతిరూపంగా నిలుస్తున్నారు.

ఆ మహనీయుడి త్యాగనిరతిని అందరూ అనుసరించాలి.
:మల్లాది విష్ణు. మాజీ ఎమ్మెల్యే.

– ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం, తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ, 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఆ మహనీయుడి త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ఆచరించాలి. నాడు గాంధీగారిని స్ఫూర్తిగా తీసుకుని పొట్టి శ్రీరాములు జీవించారు. సబర్మతి ఆశ్రమంలో కూడా ఉన్నారు. ఆయన తన జీవితంలో అయిదుసార్లు నిరాహార దీక్ష చేశారు. వాటిలో చివరిది భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం చేసిన దీక్ష. ఆయన ప్రాణ త్యాగం తర్వాతే, దేశంలో తెలుగుతో సహా, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. కానీ, నేడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే.. నాటి పొట్టి శ్రీరాములు త్యాగానికి చాలా దూరంగా ఉంది. 

మహనీయుని అడుగుజాడల్లో నడవాలి: సాకె శైలజానాథ్, మాజీ మంత్రి 
– తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమించి తన ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా అర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు. చేపట్టిన పనిని పూర్తి చేసే వరకు విశ్రమించని ఆయన లక్షణం అందరూ నేర్చుకోవాలి. అలాంటి మహా మనిషి అడుగుజాడల్లో మనం ముందుకు సాగాలి. తెలుగుజాతి ప్రతిష్టను మసకబార్చేలా పాలన సాగిస్తున్న కూటమి నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే ఆయనకు గౌరవం.
:వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి

– మహాత్మా గాంధీ ఆశయాలతో ముందుకు సాగిన నాయకులు శ్రీ పొట్టి శ్రీరాములు. తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా కలిసుండాలని, అందు కోసం ప్రత్యేక రాష్ట్రం కోరుతూ 58 రోజులు నిరాహార దీక్ష చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు తెలుగు జాతి ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచే ఉంటుంది. అలాంటి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని చంద్రబాబు విస్మరించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1వ తేదీ నుంచి మార్చేశాడు. వైయస్‌ జగన్‌ గారు సీఎం అయ్యాకనే మళ్లీ నవంబర్‌ 1న అవతరణ దినోత్సవంగా నిర్వహించడం జరిగింది. అంతే కాకుండా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం ద్వారా దివంగత వైయస్సార్‌ కూడా మహనీయుడిని గౌరవించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి రూ.1750 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహ నిర్మాణానికి చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వకపోతే ఆర్యవైశ్యులు చందాలు వేసుకుని నిర్మాణం చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు విగ్రహావిష్కరణ పేరుతో మేమే చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వంలో భద్రత లేకుండా పోయింది. వ్యాపారాలను చేసుకోనివ్వకుండా జీఎస్టీ అధికారులతో దాడులు చేయిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top