పరకామణి కేసులో ఇరికించేందుకు దుష్ట‌చ‌తుష్ట‌యం కుట్ర‌

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి
 

తిరుపతి:  ప‌ర‌కామ‌ణి కేసులో త‌న‌ను ఇరికించాల‌ని దుష్ట‌చ‌తుష్ట‌యం కుట్ర చేస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. పరకామణి చోరీ కేసులో నోటీసులు అందుకున్న భూమన కరుణాకర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సిట్‌ విచారణకు హాజరయ్యారు. అయితే.. అదికారుల ముందుకు వెళ్లే ముందు ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  
`నాకు ఈ కేసుకు  భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నారా లోకేష్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, పట్టాభిలు నన్ను కచ్చితంగా విచారణ చెయ్యాలని అధికారులపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను పిలిచారు. అయినను పోయి రావలె హస్తినకు. కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి శునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికను నింపేశాయి’’ అని భూమన అన్నారు. 
 

Back to Top