భోగాపురం ఎయిర్‌పోర్టు భూమిపూజకు ప్రధానికి ఆహ్వానం

మంత్రి బొత్స సత్యనారాయణ
 

విజయనగరం: భోగాపురం ఎయిర్‌పోర్టు భూమిపూజకు ప్రధాని నరేంద్రమోదీకి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆహ్వానం పలికారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.దీంతో పాటు గిరిజన విశ్వ విద్యాలయానికి అదే నెలలో ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించి, ఆహ్వానం పలికారని మంత్రి చెప్పారు. 
అమరావతి రైతుల పాదయాత్ర ఇక ప్రారంభం కాదని చెప్పారు. పాదయాత్రలో వంద మంది కూడా నిజమైన రైతులు లేరని పేర్కొన్నారు. ఇలాంటి యాత్రలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి తేల్చి చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top