సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో గ్రామ స్వరాజ్యం సాకారం

వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఫలాలు ప్రజలకు అందుతున్నాయి

మేనిఫెస్టోలోని 98 శాతం హామీలు మూడున్నరేళ్లలోనే నెరవేర్చాం

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం: మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం.. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో సాకారమైందని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఫలాలు మూడున్నరేళ్లుగా ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. నాడు పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసిన వైయస్‌ జగన్‌.. వాటినే ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచారని, ఎలక్షన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చి, సుపరిపాలన అందిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విజయనగరంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవరత్నాల్లోని ప్రతి అంశం పేదలకు అందాలనే లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. పాదయాత్ర సమయంలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే సహకారం చేశారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు వలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల గడప వద్దకే పరిపాలన తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా చేశారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ రాజకీయంగా బలోపేతం అయ్యారు కాబట్టే ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని, ప్రతిపక్షాల కలయిక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నైతిక విజయంగానే భావిస్తున్నామన్నారు.  
 

Back to Top