ముఖ్య‌మంత్రిని క‌లిసిన గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్ర‌తినిధులు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్య‌క్షుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల నూత‌న కార్య‌వ‌ర్గం ఇటీవ‌లే బాధ్య‌త‌లు చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా ఆ సంఘం అధ్య‌క్షుడు ర‌వీంద్ర‌రాజు, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అప్ప‌ల‌నాయుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకటరామిరెడ్డి, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వి. ఎస్‌. దివాకర్, సీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్ త‌దిత‌రులు ఉన్నారు. 

Back to Top