సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం విందు

గుంటూరు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ల గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఏర్పాటు చేసింది. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విందుకు సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్‌ దంపతులు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులు, హైకోర్టు జడ్జిలు, పలువురు సీనియర్‌ న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజ‌ర‌య్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top