ఏపీ ఫైబ‌ర్ నెట్ చైర్మ‌న్‌గా గౌతంరెడ్డి ప్ర‌మాణ స్వీకారం

 విజ‌య‌వాడ‌:  ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పున్నూరు గౌతంరెడ్డి ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేశారు. విజ‌య‌వాడ‌లో సోమ‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ..ఏపీ ఫైబ‌ర్ నెట్ సేవ‌ల‌ను విస్తృతం చేస్తామ‌ని చెప్పారు. దేశంలోనే అత్యుత్త‌మ రంగంగా తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. ప్ర‌తి గ్రామానికి ఇంట‌ర్ నెట్ సౌక‌ర్యం క‌ల్పించాల‌న్నా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉన్న‌త‌మైన ఆలోచ‌న‌కు అనుగుణంగా ప‌ని చేస్తామ‌ని చెప్పారు. ఇటీవ‌ల అమ్మఒడి ప్రారంభోత్సవంలో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు ఇస్తామని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పార‌ని గుర్తు చేశారు. రాష్ట్రం మొత్తం గ్రామాలతో సహా అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసి ఇంటర్నెట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు.  

Back to Top