నేడు కేబినెట్‌ సమావేశం

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం ఒకటో బ్లాక్‌లో నేటి ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. మంత్రిమండలి సమావేశంలో ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు ఇటీవల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేతులు మీదుగా ప్రారంభమైన ‘జగనన్న వైయస్‌ఆర్‌ బడుగు వికాసం’ పథకానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక పారిశ్రామిక విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా నూతన ఇసుక విధానంపై, ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపిన పారిశ్రామిక ప్రాజెక్టులపై, మచిలీపట్నం పోర్టుకు సంబంధించి డీపీఆర్‌పై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top