గుంటూరు:గుంటూరుకి చెందిన వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్‌ను ఎవరో తీసుకెళ్లారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి పోలీసులు అని చెప్పి.. ప్రేమ్ కుమార్‌ను తమ వెంట లాక్కెళ్లారు. ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్‌మెంట్ ప్రేమ్ కుటుంబానికి సమాచారం ఇవ్వాలని అంబటి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ట్విట్టర్ వేదికగా అరెస్ట్ వీడియోను షేర్ చేశారు. https://x.com/AmbatiRambabu/status/1867041141771624884 ఈ సందర్భంగా అంబటి..‘గుంటూరుకి చెందిన వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్‌ను ఎవరో తీసుకెళ్లారు. అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి పోలీసులు అని చెప్పి.. ప్రేమ్ కుమార్‌ను తమ వెంట లాక్కెళ్లారు. ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్‌మెంట్ ప్రేమ్ కుటుంబానికి సమాచారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. ఇక, ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ప్రేమ్ కుమార్‌కు తీసుకువెళ్తున్నారు. వారిలో ఏ ఒక్కరూ పోలీస్ యూనిఫామ్ ధరించకపోవడం గమనార్హం. మరోవైపు.. ప్రేమ్ కుమార్‌ను తీసుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదు.