కృష్ణా రివర్‌ బోర్డ్‌ చైర్మన్‌తో ఏపీ అధికారుల భేటీ

కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఫిర్యాదు

హైదరాబాద్‌: కృష్ణా రివర్‌ బోర్డ్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు  భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ నీటిపారుదల శౄఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్‌, అధికారులు పాల్గొని కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎదురవుతుందన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖతో పాటు పలు వేదికలపై అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు గుర్తు చేశారు.గోదావరి నదిపై ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు ఎలాంటి నీటి కేటాయింపులు జరగకపోయినా ఈ ప్రాజెక్టులను తెలంగాణ కొనసాగిస్తుందని కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డు చైర్మన్లకు ఏపీ అధికారులు ఫిర్యాదు చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top