ఈ నెల 11న‌ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల  ప్రమాణస్వీకారం 

బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

విజయవాడ:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి సమక్షంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. బీసీల సంక్రాంతి పేరుతో ఈ సభను నిర్వహిస్తామని వారు చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు.  మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత పాలకులు బీసీలను వెనుకబడిన తరగతులగానే చూశారని.. బీసీలను వెన్నెముకగా సీఎం వైయ‌స్ జగన్‌ భావించారని తెలిపారు. చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు పెద్దపీట వేశారని, బీసీ హృదయాల్లో సీఎం వైయ‌స్ జగన్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు

Back to Top