కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం వైయ‌స్‌ జగన్‌ భేటీ

 న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చర్చించారు.

సీఎం వైయ‌స్ జగన్‌ మంగళవారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధానికి సీఎం నివేదించారు. ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు. 

Back to Top