కృష్ణ భౌతిక కాయానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు..

కుటుంబ సభ్యులను  ప‌రామ‌ర్శించిన ముఖ్య‌మంత్రి
 

   హైద‌రాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్గజ నటుడు కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.   హైదరాబాద్‌ పద్మాలయా స్టూడియోకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మొద‌ట కృష్ణ భౌతిక కాయంపై పుష్ప‌గుచ్చం ఉంచి నివాళుల‌ర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను ముఖ్య‌మంత్రి పరామర్శించారు. కృష్ణ కుమారుడు మ‌హేష్‌బాబును హ‌త్తుకొని ధైర్యం చెప్పారు.  సీఎం జగన్‌ వెంట మంత్రి  వేణుగోపాలకృష్ణ, పలువురు ఉన్నతాధికారులు  ఉన్నారు.

 

 

Back to Top