ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం వైయస్‌ జగన్‌
 

అమరావతి: 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.  అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం వైయస్‌ జగన్‌ స్వీకరించారు. పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా 13 శాఖల శకటాలు ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో అత్యంత సాహసాలు ప్రదర్శించిన పోలీసు అధికారులకు మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లు పూర్తి అయ్యిందని, 73 లో అడుగు పెడుతున్నామని చెప్పారు. మన దేశాన్ని మన ప్రజలే పరిపాలించాలన్నారు. మన చట్టాలను మనమే చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, 

తాజా ఫోటోలు

Back to Top