ప్ర‌జా సంక్షేమానికి పెద్ద‌పీట‌

కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

అగ్రవర్ణ పేద మహిళల కోసం రూ.670 కోట్లతో ‘ఈబీసీ నేస్తం’

ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో 45 వేల సాయం

2021–22 సంక్షేమ పథకాల క్యాలెండర్‌కు కేబినెట్‌ ఆమోదం

నవరత్నాల ద్వారా 12 కోట్ల మందికి సంక్షేమ ఫలాలు

300 చ.అ టిడ్కో ఇళ్లు రూ.1కే లబ్ధిదారుడికి కేటాయింపు

300 చ.అ పైబడిన ఇళ్లకు కట్టాల్సిన రుసుములో 50 శాతం రాయితీ 

ప్రైవేట్‌ లేఅవుట్లలో 50 శాతం భూమి పేదలకు కేటాయించాలి

రైతు భరోసా కేంద్రాల్లో మరిన్ని సదుపాయాలు

కాకినాడ సెజ్‌ పేరుతో పేదలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు 

657 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఎకరాకు 5 లక్షల అదనపు పరిహారం

రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని నిర్ణయం

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం

మున్సిపాలిటీలో 2700 వాహనాలతో చెత్త సేకరణ

కేబినెట్‌ నిర్ణ‌యాలు వెల్ల‌డించిన మంత్రి పేర్ని నాని

అమరావతి: క‌్యాలెండ‌ర్ ప్ర‌కారం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌ని మంత్రి మండ‌లి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇవాళ నిర్వ‌హించిన కేబినెట్ మీటింగ్‌లో ప్ర‌జా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని, న‌వ‌ర‌త్నాల ద్వారా దాదాపు 12 కోట్ల మందికి సంక్షేమ ఫ‌లాలు అందించాల‌ని తీర్మానించిన‌ట్లు తెలిపారు. మంత్రి మండ‌లిలో కీల‌క నిర్ణ‌యాలు తీసున్నామ‌ని, ఆ వివ‌రాల‌ను మంత్రి పేర్ని నాని మీడియాకు వివ‌రించారు.

అగ్రవర్ణ పేద మహిళల కోసం కొత్త పథకం..
అగ్రవర్ణ పేద మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కాన్ని రూపొందించింది. వైయస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం ఈబీసీ వ‌ర్గానికి వ‌ర్తింప‌జేస్తూ వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనుకబాటు కలిగిన ఈబీసీలకు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున రాబోయే మూడేళ్లలో రూ.45వేలు చెల్లించేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. 

సంక్షేమ క్యాలెండ‌ర్..

వైయస్‌ జగన్‌ నాయకత్వంలో జరిగిన కేబినెట్‌ మీటింట్‌లో ఇప్పటి వరకు అందజేసిన 23 రకాల సంక్షేమ కార్యక్రమాలను వచ్చే ఏప్రిల్‌ నుంచి 2022 జనవరి వరకు అమలు చేసేందుకు సంక్షేమ క్యాలెండర్‌ రూపొందించాం. సుమారు 5.60 కోట్ల మందికి సంక్షేమ పథకాలు నెలవారిగా అందజేసేందుకు నిర్దేశిత మాసాన్ని కేటాయించాం. ఇందుకోసం క్యాలెండర్, బడ్జెట్‌ కూడా ఆమోదించాం.

  • ఏప్రిల్‌లో వసతి దీవెన, జులైలో సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్, జూన్‌లో జగనన్న విద్యా కానుక, ఏప్రిల్‌లో రైతులకు వడ్డీలేని రుణాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, మేలో ఖరీఫ్‌కు సంబంధించి రైతు భరోసా కింద 54 లక్షల మందికి పెట్టుబడి సాయం, మత్స్యకార భరోసా పథకం కింద 19 వేల మంది మత్స్యకారులకు ఆర్థిక సాయం, జూన్‌లో వైయస్‌ఆర్‌ చేయూత , జులైలో వైయస్‌ఆర్‌ వాహన మిత్ర, కాపు నేస్తం పథకం, ఆగస్టులో రైతులకు వడ్డీ లేని రుణాలు, ఎంఎస్‌ఎంఈ కింద పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమలకు సబ్సిడీలో రుణాలు, నేతన్న నేస్తం, అగ్రిగోల్డు బాధితులకు పరిహారం అందజేత, సెప్టెంబర్‌లో వైయస్‌ఆర్‌ ఆసరా , అక్టోబర్లో జగనన్న తోడు, జగనన్న చేదోడు, నవంబర్‌లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు వైయస్‌ఆర్‌ చేయూత సాయం, జనవరిలో అమ్మ ఒడి పథకం అమలు చేసేందుకు క్యాలెండర్‌ను ఆమోదిస్తూ తీర్మాణం చేశాం.
  • దాదాపుగా 8 కోట్ల మందికి లబ్ధి చేకూర్చేలా సంక్షేమ పథకాలు రూపొందించాం. ఇవి కాకుండా నెలవారి రేషన్‌ పంపిణీ, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, పింఛన్‌ పంపిణీ, సంపూర్ణ పోషణ పథకాలు కూడా అమలు చేసేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. దాదాపుగా 12 కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందజేసేందుకు క్యాలెండర్‌ రూపొందించాం. కాలమానం ప్రకారం లబ్ధిదారులకు అందజేసేందకు చర్యలు తీసుకుంటున్నాం.
  • టిడ్కో పథకం కింద అపార్టుమెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న  లబ్ధిదారులకు 1.43 లక్షల మందికి రూపాయికే ప్లాట్‌ కేటాయిస్తాం. రూ.50 వేలు ముందు చెల్లించాల్సిన వాటా భారాన్ని ప్రభుత్వం భరిస్తూ..రూ.110 కోట్లు చెల్లిస్తోంది. లక్ష రూపాయాలు చెల్లించాల్సిన వాటాను ప్రభుత్వం రూ.371 కోట్లు భారం భరిస్తూ ఆర్థిక మండలి ఆమోదం తెలిపింది.  
  • 2021 ఏప్రిల్‌ నుంచి కొత్తగా వచ్చిన ప్రైవేట్‌ లేఅవుట్‌ ప్రకారం 5 శాతం భూమి పేదలకు కేటాయించేలా తీర్మానం చేశాం. ఆ భూమిని ప్రభుత్వానికి బదలాయించాలి. లే అవుట్లు కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. కుళాయి కనెక్షన్లు కూడా అనధికారికంగా ఇవ్వకూడదని మంత్రి మండలి తీర్మానం చేసింది. 
  • రైతులకు అవసరమైన ప్రతిదీ వారి గ్రామాల్లోనే అందజేసేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతుకు అవసరమైన విత్తనం నుంచి పంట అమ్ముకునే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. రైతు పొలం వద్దే పంట కొనుగోలు చేస్తాం. గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా పెనుమూరు, కార్వేటి నగరాల్లో 50 పడకల ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. వైద్యుల నియామకానికి చర్యలు తీసుకున్నాం. 
  • వైయస్‌ఆర్‌ జిల్లాలో వైయస్‌ఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని జాయింట్‌ వెంచర్‌ పార్ట్‌నర్‌తో కలిపి నిర్మించేందుకు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా ద్వారా పారదర్శకమైన పద్ధతిలో ఎంపికను ఆమోదిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. వైయస్‌ఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం తొలి దశలో రూ.10,080 కోట్లు, రెండో దశలో రూ.6 వేల కోట్ల రూపాయాల పెట్టుబడితో ఉక్కు కర్మగారాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
  • వైయస్‌ఆర్‌ జిల్లా జమ్ములమడుగు మండలంలో 3148.68 ఎకరాల భూమిని ఏపీ హైగ్రేడ్‌కు కేటాయించి, ఈ స్థలంలో వైయస్‌ఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించాలని మంత్రి మండలి తీర్మానించింది. అంబాపురంలో  93.99 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రీయల్‌ పార్క్‌ కోసం భూమి కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
  •  వైయస్‌ఆర్‌ జిల్లా సీకే దిన్నె మండలంలో 98.58 ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్‌ పార్క్‌ నిర్మించేందుకు భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం.
  • తూర్పు గోదావరి జిల్లా కోనంకి గ్రామంలో 160.04 ఎకరాలు ఏపీ మ్యారిటైం బోర్డుకు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. 
  • వైయస్‌ఆర్‌ జిల్లా జమ్ములమడుగు మండలం ముద్దనూరులో అగ్ని మాపక కేంద్రం నిర్మాణానికి, 12 మంది సిబ్బందిని నియమించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 
  • చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం ఎదురుకుప్పం మండలంలో కూడా మరో రెండు కొత్త అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు.
  • కాకినాడ ఎస్‌ఈజెడ్‌ కోసం భూ సేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నో ఏళ్లు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకోకుండా..మా భూమి మాకే కావాలని సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న రైతులకు 2,180 ఎకరాలు తిరిగి ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వైయస్‌ జగన్‌  ఇచ్చిన మాట ప్రకాశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. 
Back to Top