హైదరాబాద్: పవన్ కల్యాణ్ చంద్రబాబుతో చేతులు కలిపాడని, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక టీడీపీ, జనసేన లోపాయకారీ ఒప్పందాలు చేసుకున్నారని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నేత అనిశెట్టి వెంకట సుబ్బారావు అన్నారు. జనసేన గెలవకూడదనే ఉద్దేశంతోనే పవన్ నాన్‌లోకల్ వ్యక్తికి టికెట్ కేటాయించారన్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది వైయస్‌ఆర్ సీపీలో చేరానన్నారు. లోటస్‌పాండ్‌లోని వైయస్ జగన్ నివాసంలో జనసేన పార్టీ నాయకులు అనిశెట్టి వెంకట సుబ్బారావు, బాలిపల్లి రాంబాబు, శైలజారాజ తదితరులు వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్ సీపీలో చేరారు. వైయస్ జగన్ దగ్గరకు వెళ్తేనే న్యాయం జరుగుతుందని వైయస్‌ఆర్ సీపీలో చేరానని, తన జీవితం ధన్యమైందని భావిస్తున్నానన్నారు.