ప్ర‌శాంతంగా ఆత్మకూరు ఉప ఎన్నిక 

ఓటు హ‌క్కు వినియోగించుకున్న మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి

నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప్రారంభం అయ్యింది. సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జరగనుంది. ఉదయమే బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన తల్లి మణి మంజరి ఇతర కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు ,వృద్దులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్‌ పోలింగ్ నడుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. 26న ఫలితాలు వెలువడుతాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top