సత్తెనపల్లి: చంద్రబాబులా నేను పొలిటికల్ డాన్సర్‌ను కాదని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రోజుకో పార్టీతో డాన్స్ చేస్తే వ్యక్తి చంద్రబాబు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ పొలిటికల్ డాన్సర్లే’ అంటూ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని ఎద్దేవా చేశారు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్. సందుల్లో మీటింగ్‌లు పెట్టి జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఎక్కడ పదువులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదన్నారు. ఆదివారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే.. మేం వదిలేసిన వాళ్లకు టికెట్లు ఇచ్చుకుని చంకలు గుద్దుకుంటున్నావ్ బాబూ..!: బహిరంగ సభల్లో, రోడ్ షోలలో జగన్ గారిని, వైఎస్సార్సీపీ అభ్యర్థులమైన నాపై, శంకరరావులపై చంద్రబాబు అనేక విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. – సత్తెనపల్లిలో చంద్రబాబు పక్కన లావు కృష్ణదేవరాయలు, కన్నా లక్ష్మీనారాయణ, జంగా కృష్ణమూర్తిలను పెట్టుకుని ఉపన్యాసం చెప్పాడు. – ఆ ముగ్గురు ఎవరు? రాజకీయంగా వారు ఎక్కడ పుట్టారని నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. – రాజకీయంగా వారు ఎక్కడ పదవులు అనుభవించారు? ఎక్కడ చేరి వారు ఈ రోజు మాట్లాడుతున్నారు? – చంద్రబాబుకు అసలు సిగ్గు అనేది ఉందా? నీకు సిగ్గు, శరం లేదు..ఉచ్చనీచాలు లేవు. చీము నెత్తురు లేదు. – మేం వదిలేసిన వాళ్లు, మేం కాదన్న వాళ్లు, మాకు పనికిరాని వాళ్లను పక్కన పెట్టుకుని చంకలు గుద్దుకుంటున్నాడు. – లావు కృష్ణదేవరాయలకు టికెట్ ఇచ్చింది మేము. జగన్ గారి ఆశీస్సులతో గెలిచాడు. తక్కువ వయసులోనే పార్లమెంటుకు వెళ్లాడు. – ఇవాళ మేం గుంటూరు వెళ్లమంటే వెళ్లనన్నాడు..సైకిల్ ఎక్కి మీ పక్కన నిలబడ్డాడు. – ఇక కన్నా లక్ష్మీనారాయణ గురించి, ఆయన నడిపిన రాజకీయాల గురించి నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. – ఆయన కాంగ్రెస్‌లో పుట్టాడు..పదవులు అనుభవించాడు..బీజేపీకి వెళ్లాడు..మళ్లీ వైఎస్సార్సీపీకి రావాలనుకున్నాడు. – ఆ తర్వాత నీ దగ్గరకు వచ్చాడు..నీ పక్కన నిల్చుని మాట్లాడుతున్నాడు. – జంగా కృష్ణమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు..? వైఎస్సార్ గారు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. – జగన్ గారు టికెట్ ఇవ్వలేకపోయినా ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవించారు. – అసలు నీదగ్గర మనుషులే లేరు. నీ తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి దిక్కే లేదు. – మేం వదిలేసిన వారికి టికెట్లు ఇచ్చి రాజకీయాలు చేసే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు. కూటమి కట్టినా..పాపం ఒక్కడే వస్తున్నాడు: – 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే వ్యక్తికి నిన్న సత్తెనపల్లి, క్రోసూరుల్లో ఎంత మంది జనం వచ్చారో గమనించాలి. – పల్నాడులో చంద్రబాబు చేసింది అట్టర్ ప్లాప్ షో. – పచ్చ చీరలిచ్చారు..డబ్బులిచ్చారు..మందిచ్చారు..అయినా నీ ముఖం చూడటానికి కూడా ఎవరూ రాలేదు. – జగన్ గారిని విమర్శించే నైతిక అర్హత అసలు చంద్రబాబుకు లేదు. – చంద్రబాబు కూటమిలో ఉండి కూడా ఒక్కడే వచ్చాడు. ఎక్కడ బీజేపీ, జనసేన నాయకులు? – జనసేన జెండాలను టీడీపీ వాళ్లే కట్టుకున్నారు. బీజేపీ జెండాలు కూడా అంతే. – టీడీపీలోనే నాలుగు ముఠాలు అయిపోయి తన్నుకు చస్తున్నారు. – ఇంత దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు సత్తెనపల్లి వచ్చి నన్ను విమర్శిస్తున్నాడు. – నేను మంత్రికి అర్హత లేని వాడిని, నాకు ఏమీ తెలియదని అంటున్నాడు. – చంద్రబాబూ అసలు నీకేం తెలుసో చెప్పు. సూళ్లూరుపేటలో మాట్లాడుతూ తాను టికెట్ ఇచ్చిన అభ్యర్థి పేరే చెప్పలేకపోయాడు. – నువ్వు టికెట్ ఇచ్చిన మహిళ పేరే నీకు తెలియదే నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? – జగన్ గారు అంబటికి మంత్రి పదవి ఇచ్చింది తనను, పవన్ కల్యాణ్‌ను తిట్టడానికే అంటాడు. – నిన్ను ఎప్పుడైనా తిట్టానా చంద్రబాబు? ఘాటుగా విమర్శించాను అంతే. – నిన్ను తిట్టిన వాడు నీ పక్కనే ఉన్నాడు. కన్నా లక్ష్మీనారాయణ ఏం తిట్టాడో ఓ సారి చూసుకో. – నిన్ను వాడెవడు..వీడెవడు అని మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణను పక్కన పెట్టుకుని నా గురించి మాట్లాడటం సమంజసమా? – నిజమే..నేను అనేక సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను విమర్శించా. – ఏ రోజూ నేను నిన్ను వాడు..వీడు అనే పదజాలమే వాడలేదు. – నారా చంద్రబాబునాయుడు గారు అనే మాట్లాడాను. – నిన్ను వాడు వీడు అని మాట్లాడిన దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకుని నన్ను ఓడించమని చెప్పడానికి నీకు సిగ్గుందా? – కన్నా బీజేపీ అధ్యక్షుడిగా మాట్లాడాడు..పొత్తు గురించి కూడా మాట్లాడాడు. – ఇవాళ చంద్రబాబు చంకనెక్కి , నాపై పోటీకి దిగితే..చంద్రబాబు నన్ను అనవసరమైన మాటలు అంటున్నాడు. – నిన్ను దూషించిన కన్నాను పక్కన పెట్టుకుని నాపై విమర్శలు చేసే అర్హత నీకు లేదు. – ఒక్కరితోనే నేనుంటా. ఒక పార్టీతోనే నేనున్నా. నాడు రాజశేఖరరెడ్డితో, నేడు జగన్‌తో ఉన్నాను. – ఒక పార్టీలో చేరి, ఆ పార్టీకి కన్నమేసి మరో పార్టీలోకి వెళ్లే నీచమైన మనస్తత్వం లేని వ్యక్తిని నేను. వైయస్ జగన్ గారి దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదు: – చంద్రబాబు అసెంబ్లీలో నేనేదో అన్నానని బావురమని ఏడ్చాడు. – ఆ తర్వాత నేను అనలేదని తెలుసుకున్నాడు..మళ్లీ ఆ విషయం మాట్లాడడు. – ఆయనొక్కడే కాదు నారా, నందమూరి కుటుంబాలు అంతా నాపై ఏడ్చేశాయి. – నేను మీడియాలో చేసే విమర్శలు సహేతుకంగా, ధర్మంగా, గౌరవంగా ఉండేలా ప్రయత్నం చేస్తా. – అప్పుడప్పుడు అంబోతు అంటే మాత్రం చంద్రబాబు అంబోతులకు ఆవుల్ని సప్లై చేసే వాడు అంటాను. – అది రియాక్షన్ తప్ప వేరేది కాదు. – ముగ్గురూ మా ఓల్డ్ బ్రదర్సే. ముగ్గురు మా పార్టీలో పుట్టి చంద్రబాబు చంకనెక్కారు. – ఆ పార్టీలోనైనా వారు ఉంటారో లేదో తెలియదు. ఓడిపోయిన తర్వాత వెళ్లిపోతారు. – జగన్ గారి దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిíస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 175 సీట్లు గెలిచి జగన్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. – టీడీపీకి చెందిన వ్యక్తులు సర్వే చేసినా జగన్ గారే ముఖ్యమంత్రి అని చెప్తున్నాయి. – అదే ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు అలా కనిపిస్తున్నాడు. – కాపురం చేసే వాడి వాలకం కాళ్లగోళ్లప్పుడే తెలుస్తుందన్నట్లు...క్రోసూరు, సత్తెనపల్లిలో ఆయనకు వచ్చిన జనాన్ని చూస్తే ముఖ్యమంత్రి అవుతాననే వ్యక్తి కళ కనిపిస్తోంది. లోకేశ్, పవన్ కల్యాణ్‌లు ఎక్కడా కనిపించరేం?: – లోకేశ్ యువగళం అని తిరిగాడు..ఇప్పుడు కనిపిండం లేదు. మంగళగిరిలోనే ఉన్నాడు. అక్కడ నుంచి కదిలితే కూసాలు కదులుతాయని భయం. – ఇక మా సోదరుడు పవన్ కల్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. రెండు రోజులు ప్రచారం చేస్తాడు..ఐదు రోజులు పడుకుంటున్నాడు. – జ్వరం వచ్చిందట..ఎందుకయ్యా నీకు రాజకీయాలు? ఆయన పిఠాపురంలో లాక్ అయిపోయాడు. – చంద్రబాబుకు ఇక తప్పదు కాబట్టి తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు. – డబ్బులు కోసం కక్కుర్తి పడే నీచమైన మనస్తత్వం నాకు లేదనేది టీడీపీ వారు కూడా చెప్తారు. – వడ్డెర మహేష్ వద్ద రెండున్న లక్షలు కాజేయడానికి ప్రయత్నం చేశానని చెప్తాడు. అలాంటి కక్కుర్తి పడే మనిషిని కాదు. – నాపై బురదజల్లాలనే ప్రయత్నం చేసినా ఆకాశం ఉమ్మితే నీమీదే పడుతుంది. – నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నంతో కన్నాను తీసుకొచ్చి పెట్టారు. – అనేక పార్టీలు మారి వచ్చిన వ్యక్తి, నిన్ను అడ్డంగా తిట్టిన వ్యక్తి మీ పార్టీలో ఉంటాడనుకుంటున్నారా? – ఓటమి పాలవ్వగానే మళ్లీ ఎక్కడికో ఒకచోటికి చెక్కేస్తాడు. – ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ గారి అండతో నే మూడో సారి పోటీ చేస్తున్నాను. – నేను ఎక్కడా తప్పు చేయలేదు. ప్రజలు నా పక్షాన ఉంటారనే నమ్మకం నాకుంది. – చంద్రబాబు చేసే అరోపణలు నమ్మవద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. పోలవరంపై చర్చకు నువ్వు సిద్ధమా?: – నాకు క్యూసెక్కులు, టీఎంసీలు, ప్రాజెక్టులు తెలియవట. చర్చకు రా..చచంద్రబాబు – ఇప్పుడే చర్చిద్దాం..పోలవరం ఎందుకు పూర్తి కాలేదో..తప్పిదం ఎవరిదో తేల్చుకుందాం రా. – కనీసం గేట్లు పెట్టకుండానే భజనలు చేయించుకున్నాడు. దమ్ముంటే రా..చర్చిస్తాం. – నీ అసమర్ధత వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల నాశనం అయ్యింది. మోడీ గారు చెప్పినట్లు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకోవడం వల్లే పోలవరం దెబ్బతింది. – దాన్ని బాగుచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణమైనా పోలవరంపై చర్చకు సిద్ధంగా ఉన్నాను. – పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధాన నిందితుడు నారా చంద్రబాబునాయుడే. నేను పండుగకే డాన్స్ చేస్తా..నువ్వు రాజకీయాల్లో పెద్ద డాన్సర్‌వి చంద్రబాబూ..!: – ప్రతి ఒక్కడూ రాంబాబు డాన్స్ వేస్తున్నాడు అంటున్నారు. మీ పక్కనున్న పవన్ కల్యాణ్ డాన్సులు వేయడం లేదా? – సినిమాల్లో డబ్బుల కోసం పవన్ డాన్సులు వేస్తున్నాడుగా..నేను డబ్బుల కోసం కాదుగా? – భోగి పండుగ రోజు ప్రతి ఏటా నేను నా సోదరులు, సోదరీమణులతో ఆనంద తాండవం చేస్తా. – పండక్కి డాన్స్ వేస్తాను తప్ప..రాజకీయ డాన్సులు వేసే స్వభావం నాకు లేదు. – చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్‌వి. మోడీతో డాన్స్ చేస్తావు. – సీపీఐ, సీపీఎంతో డాన్స్ చేస్తావ్..కాసేపు పవన్ కల్యాణ్‌తో డాన్స్ చేస్తావు. – అన్ని పార్టీలు మారుతూ డాన్స్ చేసే పొలికల్ డాన్సర్ చంద్రబాబు. – పవన్ కల్యాణ్ కూడా పోలిటికల్ డాన్స్ చేస్తాడు. కాసేపు మోడీతో, కాసేపు చంద్రబాబుతో, కాసేపు సింగిల్‌గా డాన్స్ చేస్తాడు. – అసలు మంత్రి అంటే ఏంటో తెలుసా అంటున్నాడు. మీ అబ్బాయికి తెలుసా? – నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో తెలియదా? మీ మామ దగ్గర కొట్టేయలేదా? – అన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ దెబ్బతో టీడీపీ దివాళా తీయబోతోంది. – మళ్లీ చరిత్రలో టీడీపీ కనిపించదు. బీజేపీలోకి సర్ధుకుంటుంది. – ఎన్నికల తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. చంద్రబాబు వెళితే జైలుకు వెళ్తారు లేదా మోడీ గారి పార్టీలో విలీనం చేస్తారు. బీసీల చేతిలో లావు చిత్తుగా ఓడిపోవడం ఖాయం: – శ్రీకృష్ణదేవరాయలు మూడు రాజధానులు వ్యతిరేకించడం వల్ల టీడీపీలోకి వెళ్లానని చెప్తున్నారు. – నరసరావుపేట బీసీలకు ఇవ్వాలి..మీరు వెళ్లి గుంటూరులో పోటీ చేయండి అన్నారు. – వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు మూడు రాజధానుల గురించి ఎప్పుడైనా మాట్లాడావా? – ఆయన అబద్దాలు ఆడుతున్నాడు. గుంటూరు వెళ్లి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఒక బీసీపై పోటీ చేస్తున్నాడు. – బీసీల ఓట్లు అడిగే హక్కు లావు శ్రీకృష్ణదేవరాయలకు లేదు. ఏ ఒక్క బీసీ కూడా ఇతనికి ఓటేయరు. – అనిల్ కుమార్ యాదవ్‌పై లావు చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు.