సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో అగ్రిగోల్డ్‌ బాధితుల్లో ఆనందం

ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు ఆర్థికసాయం

రాష్ట్రవ్యాప్తంగా బాధితులకు ఆర్థికాసాయం అందజేసిన మంత్రులు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలిచారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం.. తొలి కేబినెట్‌ సమావేశంలోనే రూ.1150 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతగా వైయస్‌ జగన్‌ సర్కార్‌ రూ.263.99 కోట్లు విడుదల చేసింది. రూ.10 వేల లోపు డిపాజిట్‌ దారులందరికీ చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 వేల లోపు ఉన్న 3,69,655 మంది డిపాజిట్‌ దారులందరికీ ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందజేశారు. గుంటూరు వేదికగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాటం ఫలించింది. గుంటూరులో సీఎం వైయస్‌ జగన్‌ బాధితులకు చెక్కులు పంపిణీ చేయగా.. జిల్లాల్లో మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు బాధితులకు ఆర్థికసాయం అందజేశారు.

కృష్ణా: మచిలీపట్నంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, దూలం నాగేశ్వరరావు, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.
ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలులో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆర్థికసాయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని బాధితులకు చెక్కులు అందజేశారు.  
విజయనగరం: విజయనగరంలో 57,941 మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు మంత్రి బొత్స సత్యనారాయణ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, శ్రీనివాసరావు, చిన్నఅప్పలనాయుడు పాల్గొన్నారు.
నెల్లూరు: అగ్రిగోల్డ్‌ బాధితులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.
చిత్తూరు: అగ్రిగోల్డ్‌ బాధితులకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెక్కులు పంపిణీ చేశారు.  
అనంతపురం: అగ్రిగోల్డ్‌ బాధితులకు మంత్రి శంకర్‌నారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
కర్నూలు: అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని పాల్గొన్నారు.  
వైయస్‌ఆర్‌ జిల్లా: కడపలో అగ్రిగోల్డ్‌ బాధితులకు డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా, మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాచమల్లు, వెంకటసుబ్బయ్య, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి పాల్గొన్నారు.
తూర్పుగోదావరి: కాకినాడలో అగ్రిగోల్డ్‌ బాధితులకు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, ఎంపీ గీత, ఎమ్మెల్యేలు దొరబాబు, పూర్ణచంద్రప్రసాద్‌ చెక్కులు పంపిణీ చేశారు.
పశ్చిమగోదావరి: ఏలూరులో అగ్రిగోల్డ్‌ బాధితులకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలీజా, కలెక్టర్‌ పాల్గొన్నారు.
శ్రీకాకుళం: అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆర్థికసాయం పంపిణీ, హాజరైన స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, సీదిరి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం: విశాఖ అగ్రిగోల్డ్‌ బాధితులకు మంత్రి అవంతి శ్రీనివాస్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.

Read Also: ఐదు నెలల్లో ఇవ్వగలుగుతున్నందుకు గర్వంగా ఉంది

 

తాజా ఫోటోలు

Back to Top