ఐదు నెలల్లో ఇవ్వగలుగుతున్నందుకు గర్వంగా ఉంది

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

మీ తమ్ముడిని నమ్మిన అక్కాచెల్లెమ్మలకు ధన్యవాదాలు

మీ కష్టాలను చూశాను.. విన్నాను.. నేనున్నానని మాటిచ్చా..

మీ కష్టం తెలిసినవాడిగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా..

తొలి కేబినెట్‌లోనే అగ్రిగోల్డ్‌ బాధితుల తరుఫున నిర్ణయం తీసుకున్నాం

గత ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయాలని ప్లాన్‌ వేసింది

ప్రతిపక్షంలో ఉన్నా బాధితులకు అండగా ఉన్నాం

3.70 లక్షల మందికి ఐదు నెలల్లోనే ఇవ్వగలుగుతున్నందుకు గర్వంగా ఉంది

త్వరలోనే రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులకు న్యాయం చేస్తాం

వృద్ధాప్య పింఛన్లు గత ప్రభుత్వం కంటే 3 రెట్లు అధికంగా ఇస్తున్నాం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం

గుంటూరు: మీ కష్టం తెలిసిన వాడిగా మీకు ఇచ్చిన మాటను కేవలం ఐదు నెలల్లో నిలబెట్టుకుంటూ ఆగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు ఇవ్వగలుగుతున్నందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రలో అగ్రిగోల్డ్‌ బాధితుల ప్రతి కష్టం విన్నానని, మీ కష్టాన్ని చూశానని, మీ బాధలు విన్నానని చెప్పారు. ఆ రోజు నేను ఉన్నానని మాటిచ్చానని,  మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో తొలి అడుగు వేస్తున్నానని పేర్కొన్నారు.రూ.10 వేల డిపాజిటర్లను ఆదుకునేందుకు రూ.263.99 కోట్లు విడుదల చేశామన్నారు. కోర్టు పరిధిలో ఉన్నా..3 లక్షల 70 వేల మందికి మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌బాధితులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కష్టంలో ఉన్నాం సహాయం చేసే పరిస్థితి లేదని ఆవేదనతో ఉన్నాం..కష్టం చేసేందుకు నేర్పు ఉన్నా మీ అన్న..మీ తమ్ముడు ఇక్కడికి వచ్చారని ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభివాదం చేస్తున్నాను.
మీ ఆవేదనలు, కష్టాలు చూశాను. మీకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు మీ అందరికి మధ్యకు వచ్చి మాట నిలబెట్టుకొని నిలబడ్డాను. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో గ్రామ గ్రామంలో అడుగులు వేస్తున్నప్పుడు పడిన కష్టాలు అగ్రిగోల్డ్‌ బాధితులు చెప్పినప్పుడు ఆ రోజు నేను చూశాను..మీ బాధలు నేను విన్నాను. మీ అందరికి నేనున్నానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ, ఆ కార్యక్రమంలో తొలి అడుగులు వేస్తూ ఈ రోజు అక్షరాల దాదాపుగా 30 వేల మంది ఆగ్రిగోల్డ్‌ బాధితులకు, రూ.10 వేల వరకు డిపాజిట్‌ చేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేందుకు రూ.263.99 కోట్లు విడుదల చేశాం. దేవుడు ఆశీర్వదించి, మీ అందరి దీవెనలతోనే ఇదంత చేయగలిగానని సగర్వంగా చెబుతున్నాను. రూ.20 వేల  వరకు డిపాజిట్‌ చేసిన వారందరికీ కూడా త్వరలోనే అందజేస్తాం. ఈ విషయం కోర్టు పరధిలో ఉన్న సంగతి మీకు తెలుసు. ఆస్తులన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి.ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ రూ.10 వేల డిపాజిట్‌ చేసిన వారికి ప్రభుత్వం సాయం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. అక్షరాల ఈ రోజు 3.70 లక్షల మందికి మేలు చేస్తున్నాం. రాబోయే రోజులు అందరికీ మేలు చేసే కార్యక్రమాలు చేపడుతాం. కోర్టు నుంచి అనుమతి పొంది అందరికీ డబ్బులు ఇస్తాం. ఆగ్రిగోల్డ్‌ స్కామ్‌ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆ ప్రభుత్వ పెద్దలే దురాశకు లోనై ఆగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏ రకంగా కొట్టేయాలని దిగజారిన రాజకీయాలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులకు తోడుగా నిలిచేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేశాం. అధికారంలోకి వచ్చాక ఆదుకుంటున్నామని సగర్వంగా చెబుతున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగ్రిగోల్డ్‌ బాధితులకు తోడుగా నిలిచేందుకు మే 30న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్‌ 10న తొలి కేబినెట్‌లో తీర్మానం చేశాం. జూలై 12న తొలి బడ్జెట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ కేటాయించామన్నారు. ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలల్లోనే ఆగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం. రూ.263.99 కోట్లు పంపిణీ చేస్తున్నాం. ఈ ఐదు నెలల కాలంలోనే మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన ఇంట్లో వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. మన అందరి సమస్యలు విన్నాడు. ఐదు నెలల్లోనే మనకు మేలు చేశాడని గర్వంగా చెబుతున్నాను. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నాం. గ్రామంలోనే 10 మందికి ఉద్యోగాలు ఐదు నెలల్లోనే ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో కార్మికులు, ట్యాక్సీ కార్మికుల కష్టాలు చూసిన నేపథ్యంలో పాదయాత్రలో ఇచ్చిన హమీ మేరకు అడుగులు వేశాం. 1.75 లక్షల మందికి ప్రతి ఏటా రూ.10 వేలు ఇచ్చేందుకు ఇప్పటికే తొలి అడుగులు వేశాం. మరో 50 వేల మందికి అవకాశం కల్పిస్తున్నాం. 
ఇదే వేదిక మీద నుంచి గర్వంగా చెబుతున్నాను. రైతుల కష్టాలు చూసిన వ్యక్తిగా, రైతు బిడ్డగా, అన్ని రకాలుగా అండగా ఉంటానని ఆ రోజు చెప్పాను. నేను విన్నాను. నేను ఉన్నానని రైతులకు మాటిచ్చాను. ఆ రోజు చెప్పిన దానికన్న మిన్నగా ఇచ్చాను. ఆ రోజు నాలుగేళ్లు అని చెప్పాను. ఈ రోజు ఐదేళ్లు ఇచ్చే విధంగా, ఆరోజు రూ.12,500 ఇస్తామని, ఈ రోజు రూ.13,500 ఇస్తున్నామని సగర్వంగా చెబుతున్నాను. ఐదు నెలలు తిరుగకుండానే ఈ రోజు 3.75 లక్షల మంది ఆగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు ఇస్తూ తోడుగా నిలిచాం. 
అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు నెలల్లోనే దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా తొలి సారిగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినెట్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని సగర్వంగా చెబుతున్నాను. వయసు పెరిగి ఇబ్బందులు పడుతున్న అవ్వతాతలకు గత ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ను పెంచమని అడుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సగటున నెలకు రూ.500 కోట్లు ఇస్తుంటే ఇవాళ అక్షరాల నెలకు రూ.1300 కోట్లు ఇవ్వగలుగుతున్నామని సగర్వంగా చెబుతున్నాను. సగటున గత ప్రభుత్వం కంటే 3 రెట్లు ఎక్కువగా పింఛన్‌ ఇస్తున్నానని చెబుతున్నాను. 
చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగాలు రాక అవస్థలు పడుతుంటే ప్రతి పిల్లాడికి తోడుగా ఉంటానని ఆ రోజు చెప్పాను. ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే అని చట్టం చేసింది మన  ఒక్క ప్రభుత్వమే అని సగర్వంగా చెబుతున్నాను. అది కూడా ఈ ఐదు నెలల్లోనే చేయగలిగాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాం. దాదాపు 65 లక్షల మంది పిల్లలకు ఉచితంగా కంటికి సంబంధించిన ఆపరేషన్లు చేయించి, దాదాపు 4 లక్షల మందికి అద్దాలు ఇస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నా.
ఐదు నెలలు తిరుగకుండానే రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అన్నది లేకుండా చేశాం. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ తీసుకువచ్చాం. జూడిషియల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. మనం వేసిన ఈ అడుగుల్లో అక్షరాల పోలవరంలో రూ.830 కోట్లు ఆదా చేయగలిగామని సగర్వంగా చెబుతున్నాను. వెలుగోండ ప్రాజెక్టులో దాదాపుగా రూ.50 కోట్లు ఆదా చేయగలిగాం. 
ఐదు నెలల్లోనే మీ అందరి దీవెనలు, దేవుడి ఆశీస్సులతో ఇవన్నీ చేయగలిగామని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తానని, మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుతున్నా..ఈ రోజు కంప్యూటర్‌లో బటన్‌ నొక్కగానే అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో డబ్బులు జమా అవుతాయి. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరికీ మేలు చేస్తామని మాట ఇస్తున్నాను. ఎవరైనా మిగిలిపోయి ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. అర్హులైన డిపాజిటర్లు ఎవరైనా నమోదు చేసుకోకపోతే మళ్లీ అవకాశం కల్పిస్తాం. వారందరూ కూడా జిల్లా న్యాయసేవాధికార సంస్థలో నమోదు చేసుకోవచ్చు. కలెక్టర్‌, తహశీల్దార్‌ కార్యాలయం, గ్రామ సచివాలయాల్లో ఈ నమోదు చేసే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి ఇంకొక నెల సమయం ఇస్తున్నాం. వారికి కూడా అందజేస్తామని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మంచి చేస్తానని, మీ అందరికీ మంచి జరగాలని, ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు మరొక్కమారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు..

Read Also: మాటిస్తే మడమ తిప్పని నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌

తాజా ఫోటోలు

Back to Top