మాటిస్తే మడమ తిప్పని నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌

రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
 

 

గుంటూరు: నేను విన్నాను.. నేను ఉన్నానని ప్రజా సంకల్ప పాదయాత్రలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన మాట ఇచ్చారు. మాట ఇస్తే మడమ తిప్పని మహానాయకుడిగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటి కేబినెట్‌ సమావేశంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేసే ప్రతి కార్యక్రమం చరిత్రగా చెప్పుకోవచ్చన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత మీడియాతో మాటలాడుతూ.. అగ్రిగోల్డ్‌ సంస్థ 1995లో స్థాపించబడిందని, దాదాపు 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో రూ.6380 కోట్ల పెట్టుబడులు సంస్థ వసూలు చేసిందన్నారు. ముఖ్యంగా ఏపీలో రూ.3944 కోట్లు వసూలు చేసి లక్షలాది కుటుంబాలను మోసం చేసిందని మండిపడ్డారు. న్యాయం చేయండి అంటూ బాధితులు ఎంత మొరపెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయకపోగా.. సంస్థ ఆస్తులన్నింటినీ తక్కువ ధరకే తీసుకొని లబ్ధిదారులను మోసం చేసిందన్నారు. అనేక మంది ఆత్మహత్యలకు కారణమైందన్నారు.
సీఎం వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్రలో బాధితుల సమస్యలను నేను విన్నాను.. నేను ఉన్నానని మాట ఇచ్చారన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని మహానాయకుడిగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కేబినెట్‌లోనే రూ. 1150 కోట్లు అగ్రిగోల్డ్‌ బాధితులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైయస్‌ఆర్‌ సీపీ పేరు నిలబెట్టేట్లుగా యువజనులకు ఉద్యోగాల విప్లవం తీసుకువచ్చారని, శ్రామికుల కోసం వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం తీసుకువచ్చి అనేకమందిని ఆదుకున్నారన్నారు. రైతును ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం తీసుకువచ్చి చెప్పిన మాట కంటే ఎక్కవగా రూ.13500 ఇచ్చి ఆదుకున్నారన్నారు. పాలకులు మంచివారైతే ప్రకృతి సహకరిస్తుందనేదానికి ఇంతకంటే నిదర్శనం ఉండదు. సామాన్య దళిత మహిళ అయిన తనకు కీలక పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎల్లకాలం రుణపడి ఉంటాను.

Read Also: అగ్రిగోల్డ్‌ బాధితులకు సీఎం వైయస్‌ జగన్‌ బాసట

తాజా ఫోటోలు

Back to Top