గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచారని వైయస్‌ఆర్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఎంతో మంది అగ్రిగోల్డ్ బాధితులు తాము డిపాజిట్లు చేసుకున్న బాధితులు తమకు అన్యాయం జరిగిందని జీవితమైన విరక్తి చెంది ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని గత ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదన్నారు. ఆ రోజు వైయస్ జగన్ ఇచ్చిన మాట మేరకు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారని చెప్పారు. బాధితులందరికీ కూడా డిపాజిట్లు చెల్లించే కార్యక్రమం చేపట్టామన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఓ ప్రైవేట్ సంస్థ మోసం చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎక్కడా చూడలేదన్నారు. ప్రజల కష్టసుఖాలు పట్టని వాడు అసలు పాలకుడే కాదని మహానేత వైయస్‌ఆర్ చెప్పేవారన్నారు. ఆ మహానేత ఆశయాలను వైయస్ జగన్ ప్రతి ఒక్కరిలో చిరునవ్వు చూసేందుకు ఈ కార్యక్రమం తీసుకుందన్నారు. నీ కోసం జీవిస్తే నిలాగే జీవిస్తావు..జనంలో జీవిస్తే జనంతో ఉంటావన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాటలు ఇవాళ నిజం చేశారన్నారు. జనం కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైయస్ జగన్ వారికి అండగా నిలిచారన్నారు. అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చుతున్నారని చెప్పారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తనను బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడిగా నియమించడంతో బాధితుల తరఫున నిలబడ్డానని, మా నాయకుడు ఇచ్చిన హామీని నెరవేర్చారని తెలిపారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సీఎం వైయస్ జగన్ కృషి చేశారని బాధితులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. Read Also: అగ్రిగోల్డ్ బాధితులకు శుభదినం